Fish Oil Prevent Heart Attacks : చేప నూనెతో గుండెకు మేలు! వారానికి రెండు సార్లు చేపలు తింటే గుండెపోటు ముప్పు తప్పినట్లే?

చేపనూనె గుండెకు ఒక వరంగా చెప్పవచ్చు. చేపనూనె తీసుకునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు సమస్యలను తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది.

Fish Oil Prevent Heart Attacks : చేప నూనెతో గుండెకు మేలు! వారానికి రెండు సార్లు చేపలు తింటే గుండెపోటు ముప్పు తప్పినట్లే?

fish oil

Updated On : August 24, 2022 / 11:44 AM IST

Fish Oil Prevent Heart Attacks : చేపలు అత్యంత పోషకమైన , ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఒకటి. దీనిలో విటమిన్లు, ఖానిజాలు సహా అనే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఒమేగా 3 కొవ్వులు అధికంగా ఉండే వనరుల్లో చేపలు మొదటి స్ధానంలో ఉంటాయి. చేపలు తినటం చాలా మందికి ఇష్టం ఉండదు. అలాంటి వారు వాటి ప్రయోజనాలు పొందేందుకు చేపలు నుండి తయారైన నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెలో ఒమేగా 3 కొవ్వులే కాకుండా విటమిన్ ఎ, డి లు కూడా ఉంటాయి.

చేపనూనె గుండెకు ఒక వరంగా చెప్పవచ్చు. చేపనూనె తీసుకునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల్లో తేలింది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు సమస్యలను తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. ఇటీవలికాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుండె పోటు మరణాలు అధికమయ్యాయి. ఈ నేపధ్యంలో చేప నూనెను తీసుకునే వారిలో గుండె జబ్బులు తక్కువగా ఉన్నట్లో పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. చేప నూనెలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లం మానసిక ఒత్తిడి నుండి గుండెను కాపాడుతుంది. హృదయ నాళాల పనితీరు మెరుగుపరుస్తుంది.

వాపు నిరోధక లక్షణాలు చేప నూనెలో ఉన్నాయి. గాయాలను తగ్గించటానికి తోడ్పడుతుంది. గుండెలో స్టెంట్ ఉన్నవారు చేప నూనె వాడటం వల్ల ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మెదడు చేప నూనె బాగా ఉపకరిస్తుంది. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నవారు చేప నూనె ఆహారంలో చేర్చుకోవటం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఒమేగా 3 ఆమ్లాలు నాడీ కణాల తగినంత పనితీరుకు కూడా అవసరం. చేపల నూనె జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడానికి సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలలో తేలింది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల తేమ నిలుపుకునే సామర్ధ్యాల వల్ల క్రమం తప్పకుండా తీసుకుంటే పొడి కళ్ళను నివారించడానికి చేప నూనె ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వారానికి రెండు పర్యాయాలు చేపలను తీసుకోవటం వల్ల ఒమేగా 3 కొవ్వులను పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.