ABC Juice Benefits: గుండె, మెదడు ఆరోగ్యానికి ABC పవర్ జ్యూస్.. రోజుకో గ్లాస్ తాగితే దెబ్బకు రోగాలన్నీ మాయం
ABC Juice Benefits: ABC అంటే ఇందులో ఉపయోగించే మూడు ప్రధాన పదార్థాల మొదటి అక్షరాలు.

Health benefits of drinking abc power juice daily
ప్రస్తుతకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యమైన విషయంగా మారిపోయింది. దీనికి కారణాలు కూడా అనేకం ఉన్నాయి. మారుతున్న జీవన శైలీ, ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి, మనం తీసుకునే ఆహరం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని డైట్ లోచేర్చుకోవాలి. అలాంటి వాటిలో ఏబీసి జ్యూస్ ఒకటి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఈ జ్యూస్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. అంతే ఎక్కువ ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఈ జ్యూస్. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
అసలు ఏబీసీ జ్యూస్ అంటే ఏమిటి?
ABC అంటే ఇందులో ఉపయోగించే మూడు ప్రధాన పదార్థాల మొదటి అక్షరాలు. అందులో A అంటే ఆపిల్, B అంటే బీట్‌రూట్, C అంటే క్యారెట్ అని అర్థం. ఈ మూడు పదార్థాలను కలిపి గ్రైండ్ చేసి, తయారుచేసే శక్తివంతమైన జ్యూస్‌నే ABC జ్యూస్ అంటారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డిటాక్స్ డ్రింక్‌గా పరిగణించబడుతుంది.
ABC జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
1.శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.
బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అన్తకాదు ఇది రక్తాన్ని శుద్ధి చేసి, హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.
2.మెదడు ఆరోగ్యానికి మేలు:
ఆపిల్‌లో ఉండే ఫైటోన్యూట్రియంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. జ్ఞాపక శక్తి తగ్గే వయసులో ఇది తాగడం వల్ల మంచి ఫలితాలు అందుతాయి.
3.కంటి చూపును మెరుగుపరచడం:
కేరెట్‌లో ఉండే విటమిన్ A , బీటాకెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడతాయి. వయసు వల్ల వచ్చే కంటి సమస్యలను ఇది నయం చేస్తుంది.
4.గుండె ఆరోగ్యం:
బీట్‌రూట్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కోలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
5.ఇమ్యూనిటీ పెంపు:
ఆపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ మూడింటిలోనూ విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగాలు రాకుండా ఉంటుంది.
6.చర్మ సౌందర్యం:
ABC జ్యూస్ లోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ జ్యూస్ ను రోజు తీసుకోవడం వల్ల మొహంపై వచ్చే మొటిమలు, మచ్చలు పూర్తిగా నయం అవుతాయి.
7.బరువు తగ్గడానికి సహాయం:
ఏబీసీ జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కానీ, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల బరువు తగ్గడంలో మేలు చేస్తుంది.
ABC ఎలా తయారుచేయాలి?
యాపిల్, బీట్ రూట్, క్యారెట్ మూడు పదార్థాలను బాగా కడిగి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తగినంత నీరు వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత వడగట్టి జ్యూస్ ను గ్లాస్ లో పోసుకోవాలి. అలాగే తీగేయవచ్చు. లేదా రుచి కోసం కావాలంటే కొద్దిగా నిమ్మరసం కలిపి తాగవచ్చు. ఉదయాన్నే ఖాళీ పొట్టతో తాగితే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు తాగితే ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి.