Okra Water Benefits: బెండకాయ నీటితో బోలెడన్ని లాభాలు… వీళ్ళు మాత్రం అస్సలు తాగకూడదు.

బెండకాయను మధ్యలో కట్ చేసి రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల చాలా రకాలా ప్రయోజనాలు ఉన్నాయి.

Okra Water Benefits: బెండకాయ నీటితో బోలెడన్ని లాభాలు… వీళ్ళు మాత్రం అస్సలు తాగకూడదు.

Okra Water Benefits

Updated On : June 23, 2025 / 12:59 PM IST

బెండకాయ అనేది సాధారణంగా ప్రతీ ఇంట్లో కనిపించే కూరగాయనే. చాలా మంది ఎంతో ఇష్టంగా తినే ఈ కూరగాయలో చాలా ఔషధగుణాలు ఉన్నాయట. కేవలం వంట రూపకంగానే కాదు బెండకాయ నీటిని తాగడం వల్ల కూడా మంచి ఆరోగ్య ఫలితాలు ఉన్నాయట. నిజానికి బెండకాయ అనేది షుగర్ సమస్య ఉన్నవారికి చాలా మంచి ఔషధంగా చెప్తారు. కానీ, బెండకాయ నానబెట్టిని నీటిని తాగడం వల్ల అంతకుమించి ప్రయోజనాలు ఉన్నయాట. నిపుణులు సైతం ఈ విషయాన్ని బలంగా చెప్తున్నారు. మరి బెండకాయ నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అది ఏ సమయంలో తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బెండకాయను మధ్యలో కట్ చేసి రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల చాలా రకాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహారం త్వరగా జీర్ణం అవకుండా చేస్తుంది. అలాగే ఆహరంలోని గ్లూకోజ్ ను శరీరం తీసుకోకుండా నియంత్రిస్తుంది. దీనివల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అంతేకాకుండా బెండకాయ నీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గిస్తాయి. రక్తనాళాల్లో వాపు, గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడుతాయి.

బెండకాయ నీటిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను నయం చేస్తాయి. మొహంపై ముడతలు, మొటిమలు రాకుండా సహాయపడతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇంకా బెండకాయలో కాల్షియం, విటమిన్ K, మెగ్నీషియం లాంటి చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి బలంగా తయారుచేస్తాయి.

బెండకాయ నీటి వల్ల కలిగే సమస్యలు:

బెండకాయలో ఉండే అధిక ఫైబర్ వల్ల కొందరికి అజీర్తి, వాంతులు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావొచ్చు. మరి కొంతమందిలో బెండకాయను అధికంగా తినడం వల్ల అలర్జీ ఏర్పడుతుంది. చర్మంపై చిన్న చిన్న దద్దుర్లు, దురద సమస్యలు రావొచ్చు. బెండకాయ నీళ్లు అధికంగా తీసికోవడం వల్ల కిడ్నీలో రాళ్ళ సమస్య రావొచ్చు. ఇందులో ఉండే ఆక్సలేట్ పదార్థం రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి. బెండకాయ నానబెట్టిన నీటిని తాగడం మంచిదే కానీ, అది మితంగా మాత్రమే తీసుకోవాలి.