Ear Health: తరుచూ చెవులు గడలు పడుతున్నాయా.. అయితే అది ఈ వ్యాధి సంకేతమే.. నిర్లక్ష్యం అస్సలే వద్దు

Ear Health: ఇది చెవులో ఏదైనా శబ్దం అదేపనిగా వినిపిస్తూ ఉండే స్థితి. ఇది శబ్దం లేకపోయినప్పటికీ వ్యక్తికి గడలు పడుతున్నట్టుగా అనిపిస్తుంది.

Ear Health: తరుచూ చెవులు గడలు పడుతున్నాయా.. అయితే అది ఈ వ్యాధి సంకేతమే.. నిర్లక్ష్యం అస్సలే వద్దు

Health problems caused by falling ears

Updated On : August 1, 2025 / 3:27 PM IST

మన శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో ప్రత్యేకమైన పాత్ర ఉంది. చెవులు శబ్దాలను వినిపించే ప్రధాన అవయవాలుగా పని చేస్తాయి. అలాగే శరీర సమతౌల్యాన్ని నిలుపుకోవడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, కొన్నిసార్లు అనుకోకుండా చెవుల్లో “గడలు పడటం” అనుభవం కలుగుతుంది. చాలా మంచి దీనిని అనుభూతి చెందే ఉంటారు. అయితే, కొంతమందికి ఇది మామూలుగానే అనిపించవచ్చు. కానీ, ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. మరి ఆ సమస్యలు ఏంటి? చెవులు ఎందుకు గడలు పడతాయి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

చెవుల్లో గడలు పడటం అంటే ఏమిటి?

చెవుల్లో గడలు పడటం అంటే ఒక్కోసారి తల తిరిగే సమయంలో, లేదా కొన్ని శబ్దాలను విని తర్వాత, చెవుల్లో సడన్ గా గోలుగా ఏదో తిరిగినట్టుగా లేదా శబ్దాలు సరిగా వినిపించకపోవడం జరుగుతుంది. దీనినే చెవులు గడలు పడటం అంటారు.

ఇది సూచించే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు:

1.టినిటస్ (Tinnitus):
ఇది చెవులో ఏదైనా శబ్దం అదేపనిగా వినిపిస్తూ ఉండే స్థితి. ఇది శబ్దం లేకపోయినప్పటికీ వ్యక్తికి గడలు పడుతున్నట్టుగా అనిపిస్తుంది.

2.మిడిల్ ఈర్ ఇన్ఫెక్షన్:
ఇది బాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చే చెవుల ఇన్ఫెక్షన్. దీనివల్ల చెవి లోపల ఒత్తిడి పెరిగి గడలు పడేలా అనిపిస్తుంది.

3.ఇయర్‌వాక్స్:
చెవిలో మిగిలిపోయిన వేణుకు(గులిమి) వల్ల శబ్ద ప్రవేశం, అవగాహనలో అంతరాయం ఏర్పడి గడలు పడ్డట్టుగా అనిపిస్తుంది.

4.హై బీపీ లేదా శరీర ఒత్తిడి:
అధిక రక్తపోటు లేదా మానసిక ఒత్తిడి వల్ల కూడా చెవుల్లో గడలు పడే లక్షణాలు కనిపిస్తాయి.

5.హార్మోనల్ మార్పులు/థైరాయిడ్ సమస్యలు:
సహజంగా వచ్చే హార్మోన్ అసమతుల్యత వల్ల కూడా ఈ లక్షణం కనిపించవచ్చు.

నిర్లక్ష్యం చేయకూడదు?

  • చెవుల్లో గడలు పడటం పక్కనపెట్టేంత చిన్న సమస్య కాదు. ఇది మెదడు, నర్వ్, గుండె సంబంధిత సమస్యల సంకేతం కావచ్చు.
  • దీర్ఘకాలంగా ఉంటే వినికిడి తగ్గిపోవచ్చు, లేదా శరీర సమతౌల్యం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
  • చిన్న సమస్యను ముందే గుర్తిస్తే, పెద్ద సమస్యలు నివారించవచ్చు.

నివారణకు సూచనలు:

  • చెవిలో వేణుకు(గులిమి) పేరుకోకుండా చూసుకోవాలి. కనీసం పది రోజులకి ఒకసారి చెవులను శుభ్రం చేసుకోవాలి.
  • అధిక శబ్దాలు వినకూడదు.
  • తగినంత నిద్ర, మంచి ఆహారం, మానసిక ఆరోగ్యం అవసరం
  • చెవుల్లో ఏమైనా అసాధారణమైన అనుభూతి ఉంటే వెంటనే ENT డాక్టర్‌ను సంప్రదించాలి.