Health Tips: మధ్యాహ్న భోజనం తరువాత ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే స్థూలకాయం గ్యారంటీ
మధ్యాహ్న భోజనం (లంచ్) మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది(Health Tips). ఎందుకంటే, మనిషి సరిగా, పుష్టిగా ఆహారం

Health Tips: These things should never be done after lunch
Health Tips: మధ్యాహ్న భోజనం (లంచ్) మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే, మనిషి సరిగా, పుష్టిగా ఆహారం తీసుకునేది మధ్యాహ్నమే కాబట్టి. డైట్ చేసేవాళ్ళు అన్ని రకాల ఐటమ్స్ తినేది ఇప్పుడే. ఈ భోజనమే మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. అయితే, చాలా మందికి మధ్యాహ్న భోజనం తరువాత నిద్ర పోవడం అలవాటుగా ఉంటుంది. అందుకే తిన్న వెంటనే పడుకుండిపోతారు. కానీ, ఆలా చేయడం మంచిది(Health Tips) కాదు. దానివల్ల అనేకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. కేవలం నిద్ర పోవడమే కాదు ఈ 5 రకాల పనులను మధ్యాహ్న భోజనం తరువాత చేయకూడదు. మరి ఆ పనులు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.వెంటనే నిద్రపోవడం:
భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు చాలామందిలో ఉంటుంది. ఇలా చేయడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. తిండి పూర్తిగా జీర్ణం కాకముందే పడుకోవడం వల్ల అజీర్తి, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. కనీసం భోజనం చేసిన తరువాత 30 నుంచి 60 నిమిషాలు నిద్రకు దూరంగా ఉండటం మంచిది.
2.స్మోకింగ్ (పొగత్రాగడం):
భోజనం తర్వాత సిగరెట్ తాగడం చాలా మందికి అలవాటు అయింది. కానీ ఇలా చేయడం అనేది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. భోజనం చేసిన తరువాత పొగత్రాగడం వల్ల శరీరానికి జరిగే నష్టం రెట్టింపు అవుతుంది. ఇది జీర్ణ సమస్యలతో పాటు లంగ్ కాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
3.వెంటనే స్నానం చేయడం:
భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం మంచి అలవాటు కాదు. ఎందుకంటే భోజనం తర్వాత శరీరం రక్తప్రవాహాన్ని జీర్ణ వ్యవస్థ వైపు మళ్లిస్తుంది. అయితే మనం స్నానం చేస్తే రక్తప్రవాహం చర్మానికి మళ్లుతుంది. దానివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది అజీర్తికి కారణమవుతుంది.
4.తక్షణం ఫిజికల్ ఎక్సర్సైజ్:
భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయడం చాలా ప్రమాదం. మధ్యాహ్న భోజనం తరువాత శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడంలో పనిలో ఉంటుంది. ఈ సమయంలో శారీరక శ్రమ పెరగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఇది అజీర్తి, కడుపులో నొప్పి లాంటి సమస్యలకు దారి తీస్తుంది. అలాగే గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.
5.టీ లేదా కాఫీ తాగడం:
భోజనం తరువాత వెంటనే టీ లేదా కాఫీ లాంటివి తాగకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిదికాదు. ఈ పానీయాలలో ఉండే టానిన్లు ఐరన్ శోషణను తగ్గిస్తాయి. ముఖ్యంగా కూరగాయలు, పప్పులు వంటి ఐరన్ ఉన్న ఆహారం తీసుకున్నవారికి ఇది మరింత నష్టం కలిగిస్తుంది. కనీసం భోజనం తర్వాత 30 నుంచి 45 నిమిషాలు గ్యాప్ తరువాతనే టీ/కాఫీ తాగాలి.