New Study : పెళ్లి చేసుకుంటే బీపీ పెరుగుతుందా? ఓ అధ్యయనం ఏం చెబుతోందంటే…
పెళ్లైన జంటల్లో ఎవరికి అధిక రక్తపోటు ఉన్నా అది మరొకరికి వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చైనా, భారత్‌లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

New Study
New Study : పెళ్లి చేసుకోవడం వల్ల బీపీ పెరుగుతుందా? అంటే కాదు.. కానీ పెళ్లైన జంటల్లో భార్యాభర్తల్లో ఎవరికి రక్తపోటు ఉన్న మరొకరికి వచ్చే అవకాశం ఉందని కొత్త స్టడీ చెబుతోంది. అందుకు కారణాలు ఏంటి?
Health Benefits of Okra : గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూరగాయ ఒక్కటి చాలు !
ఇటీవల అధ్యయనం ప్రకారం మధ్యవయసులో ఉన్నవారు, వృద్ధులలో ఎక్కువగా రక్తపోటు ఎదుర్కుంటున్న జంటలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా, ఇంగ్లండ్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించిన పరిశోధనల్లో జీవిత భాగస్వామిలో ఒకరికి రక్తపోటు ఉంటే మరొకరికి కూడా రక్తపోటు వచ్చే అవకాశం గణనీయంగా ఉందని తేలింది.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఈ నాలుగు దేశాలలో 30,000 జంటల డేటాను పరిశీలించారట. ఇంగ్లండ్ జంటల్లో దాదాపు 47%, యునైటెడ్ స్టేట్స్‌లో 37.9%, చైనాలో 20.8%, ఇండియాలో 19.8% ఈ పరిస్థితి ఉన్నట్లు వీరి అధ్యయనంలో తేలింది. భార్యాభర్తల మధ్య జరిగే ఆరోగ్యకరమైన సంభాషణలు, వారిద్దరి జీవన విధానం రక్తపోటుపై గణనీయంగా ప్రభావం చూపిస్తాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
Water Fasting : వాటర్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ? ఆరోగ్యంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది ?
చైనా,ఇండియా కంటే యునైటెడ్ స్టేట్స్, ఇంగ్లండ్‌లో అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎక్కువ శాతం ఉన్నారు. అయితే భార్యభర్తలు అధిక రక్తపోటుతో బాధపడేవారి సంఖ్య మాత్రం చైనా, భారత్‌లో ఎక్కువగా ఉంది. చైనా, భారత్‌లో కుటుంబం కలిసి ఉండాలనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవన శైలితో జంటలు ఒకరినొకరు పర్యవేక్షించుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చని కూడా సూచిస్తున్నారు.