Over Exercise Effects: జాగ్రత్త.. వ్యాయామంతో కిడ్నీ సమస్యలు.. మెదడుపై ప్రభావం

Kidney problems due to excessive exercise
శరీర ఆరోగ్యం కోసం వ్యాయాయం చాలా అవసరం. అందుకే ప్రతీ డాక్టర్ లేదా నిపుణులు రోజులో కనీసం ఒక గంటసేపైనా వ్యాయాయం చేయాలని సూచిస్తారు. ప్రస్తుత కాలంలో చాలా మంది శారీరక శ్రమకు దూరం అవుతున్నారు. అలాంటి వారికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయాయం వల్ల రక్తప్రసారం సక్రమంగా జరిగి జీవిక్రియలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడవు. చాలా మంది ఉదయం, సాయంత్రం ఇంటి దగ్గర లేదా జిమ్ లోనో చిన్న చిన్న ఎక్సర్ సైజ్ లు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి సమస్య లేదు కానీ, కొంతమంది మాత్రం అదేపనిగా వ్యాయాయం చేస్తూ దేహదారుఢ్యం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి అధిక వ్యాయాయం అనేది కిడ్నీ, మెదడు సమస్యలకు కారణం అవుతుంది.
Also Read: Coocking oil: ఈ 8 రకాల నూనెలు చాలా డేంజర్.. క్యాన్సర్ ప్రమాదం.. అధ్యాయనాల్లో షాకింగ్ నిజాలు
ఇటీవల కాలంలో యువత చాలా మంది సిక్స్ ప్యాక్ అని, 8 ప్యాక్ అని కండలు తిరిగిన శరీరం కోసం జిమ్ లో ఎక్కువగా కష్టపడుతున్నారు. కండరాల బలం కోసం ప్రోటీన్, క్రియాటిన్ ఎక్కువగా తీసుకుంటారు. అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. కిడ్నీ సమస్యకు ప్రధాన కారణం క్రియాటిన్. శరీరంలోని కండరాలల్లో క్రియాటిన్ ఉంటుంది. ఇది కండరాలకు శక్తిని అందిస్తుంది. వ్యాయామ సమయంలో శరీరానికి అధిక శక్తి అవసరం కాబట్టి క్రియాటిన్ పౌడర్, ప్రోటీన్ పౌడర్ లు తాగుతున్నారు. దాంతో శరీరంలో క్రియాటిన్ శాతం పెరిగిపోయి కిడ్నీల్లో రాళ్ళ సమస్య తలెత్తుతుంది.
ఈ క్రియాటిన్ విచ్ఛిన్నమయ్యే క్రమంలో అది అనే వ్యర్థ పదార్థంగా మార్పు చెందుతుంది. అది రక్తంలో కలిసి కిడ్నీలకు చేరుకుంటుంది. దాన్ని వడగట్టటానికి కిడ్నీలు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అలా కిడ్నీలు క్రియాటిన్ ని సరిగా వడగట్టకపోవడం వల్ల రక్తంలో క్రియాటినిన్ స్థాయిలు పెరుగుతాయి. సాధారణంగా రక్తంలో క్రియాటిన్ మోతాదు 0.7 నుంచి 1.2 ఎంజీ/డీఎల్ వరకూ ఉంటుంది. కానీ, పొడులు, చాక్లెట్ల రూపంలో క్రియాటిన్ తీసుకోవడం వల్ల అది 25 ఎంజీ/డీఎల్ వరకూ చేరుకుంటుంది.
సాధారణ స్థాయిలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ప్రమాదం కూడా. అలాంటి వారిలో కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేయడం తప్పా వేరేదారి లేదు. కాబట్టి శరీరానికి వ్యాయాయం అవసరమే కానీ, దేహదారుఢ్యం కోసం ఆర్టిఫీషియల్ ప్రోడక్ట్స్ వాడి శరీరాన్ని రోగాల పాలు చేస్తున్నారు. అందుకే వ్యాయామ సమయంలో వాడే క్రియాటిన్, ప్రోటీన్ పొడుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. శారీరాన్ని ఆరోగ్యాంగా ఉంచుకోండి.