Emotions and immune function : ఎప్పుడూ విచారంగా ఉండకండి.. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందట
ఒత్తిడి, ఆందోళన, విచారంగా ఉండటం.. ఇవన్నీ మన రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయట. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారిలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారట.

Emotions and immune function
Emotions and immune function : మీరు ఒత్తిడిలో ఉన్నారా? కోపంగా, విచారంగా ఉంటున్నారా?.. ఇవన్నీ మీ శరీరంపై ఎంత ప్రభావితం చేస్తాయో తెలుసా? ఇలాంటి భావోద్వేగాలు రోగ నిరోధక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
Anger Management : కోపంతో ఉన్నప్పుడు నివారించాల్సిన 6 ఆహారాలు ఇవే !
ఒత్తిడి మన రోగ నిరోధక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందట. అలాగే మనం కోపం, భయంతో ఉన్నప్పుడు కూడా మన శరీరం నుంచి కార్టిసాల్, అడ్రినలిన్ అనే ఒత్తిడి హార్మోన్లు రిలీజ్ అవుతాయట. ఇవి కాలక్రమేణా రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తాయట. ఒత్తిడితో బాధపడేవారు శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు, ధ్యానం, యోగా వంటివి చేస్తే మంచిదిట.
కొంతమంది ఎప్పుడూ విచారంగా ఉంటారు. జీవితంలో ఏదో కోల్పోయినట్లు.. ఎందుకు పనికిరామని బాధపడుతుంటారు. చెప్పాలంటే ఒకలాంటి డిప్రెషన్‌లో ఉంటారు. వీరిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఇతర వ్యాధులు తీవ్ర ప్రభావాన్ని చూపించడంతో శరీరం వాటితో పోరాడటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలో మార్పులు, సామాజికంగా ఒంటరితనం ఇవన్నీ కూడా మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయట. అలాంటి పరిస్థితులో వ్యాయామం నిర్లక్ష్యం చేసినా, సరైన ఆహారం తీసుకోకపోయినా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందట.
Tickle Smile : కితకితలు పెడితే నవ్వు ఎందుకు వస్తుందో తెలుసా?
ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా వారి రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. కాబట్టి ఒత్తిడి, ఆందోళన, విచారం, కోపం ఇలాంటి భావోద్వేగాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే ఇతర అనారోగ్యాలు శరీరంపై తీవ్రస్ధాయిలో దాడి చేసే ప్రమాదం ఉంది.