Olive Oil : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచటంలో సహాయపడే ఆలివ్ ఆయిల్!

అధిక బరువు, ఊబకాయానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు చిన్న ప్రేగు, కడుపు, ఎగువ జీర్ణవ్యవస్థ యొక్క క్యాన్సర్‌తో సహా కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తక్కువగా కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Olive Oil : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచటంలో సహాయపడే ఆలివ్ ఆయిల్!

Olive oil helps reduce bad cholesterol

Updated On : September 6, 2022 / 10:38 AM IST

Olive Oil : రోజువారి ఆహారపదార్ధాల తయారీలో ఉపయోగించే నూనెల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరంగా ఉండేందుకు అవసరమైన అన్ని పోషకాలు లభించే నూనెలను మాత్రమే వినియోగించాలి. అలాంటి వాటిలో ఆలివ్ ఆయిల్ అద్భుతమైనదనే చెప్పాలి. ఒక చెంచా ఆలివ్ ఆయిల్‌లో కేలరీలు 126, కొవ్వు 14 శాతం కొవ్వు, కార్బోహైడ్రేట్, చక్కెర మొదలైనవి చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె కొలెస్ట్రాల్, బిపిని నియంత్రిస్తుంది, హృదయ స్పందన రేటును సాధారణంగా ఉంచుతుంది, మెదడుకు బలాన్ని ఇస్తుంది.

అధిక బరువు, ఊబకాయానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆలివ్ నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకునే వ్యక్తులు చిన్న ప్రేగు, కడుపు, ఎగువ జీర్ణవ్యవస్థ యొక్క క్యాన్సర్‌తో సహా కొన్ని రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తక్కువగా కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల గుండె జబ్బులు తగ్గడం.. మెరుగైన కంటి చూపు, యాంటీ ఏజింగ్ స్కిన్ వంటి ప్రయోజనాలున్నాయి. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మానికి నిగారింపు వస్తుంది. శరీరానికి కావాల్సిన రోగ నిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

డయాబెటిస్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఆలివ్ ఆయిల్‌కు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదని వైద్య నిపుణులు అంటున్నారు. శరీరంలో అదనంగా ఉండే కొవ్వు కరగడంతో బరువు కూడా తగ్గుతుంది. రక్త ప్రసరణను అదుపులో ఉంచుతుంది. ఆలివ్ ఆయిల్‌లో సమృద్ధిగా లభించే కాల్షియం ద్వారా..శరీరంలో కాల్షియం లోపం నివారించవచ్చు. ఈ నూనెలో 70 శాతం వరకు మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి, తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, శరీరంలో బలాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఆకలిని పెంచుతుంది. కాలేయ సమస్యలలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే మెనోశాచురేటెడ్‌ ఫ్యాటీయాసిడ్లు ఈ నూనెలో ఎక్కువగా ఉంటాయి. ఇవి లోడెన్సిటీ లైపో ప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌) కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ నూనె దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచడానికీ తోడ్పడుతుంది.