రెండు నెలల్లో ఆక్స్‌పర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్.. ట్రయల్ ఫలితాలు ఇవే!

కరోనా వైరస్ వ్యాధి బారిన పడిన 1.4 కోట్ల మందితో పాటు ప్రపంచమంతా COVID-19 వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ
ప్రపంచానికి గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. కోవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేస్తోంది. మరో రెండు నెలల్లో Covid-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. వ్యాక్సిన్‌కు సంబంధించి ట్రయల్స్
ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక వ్యాక్సిన్ రావడమే మిగిలి ఉంది.
ప్రస్తుతం.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దశలలో ట్రయల్ నిర్వహించింది. కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి 150
మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో రూపొందించిన వ్యాక్సిన్ అభ్యర్థులలో ఒకరిగా పేర్కొన్నారు.
నివేదికల ప్రకారం.. కరోనా ప్రారంభ పరీక్షలలో సానుకూల ఫలితాలు వచ్చాయని Lancet సంపాదకులు రిచర్డ్ హోర్టన్ ట్వీట్ చేశారు. అధికారికంగా AZD1222గా పిలిచే ఈ టీకాను Oxford యూనివర్శిటీలోని Nuffield Department of Medicine భాగమైన జెన్నర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. దీనికి బ్రిటిష్-స్వీడిష్ ఔషధ సంస్థ AstraZeneca PLC
సపోర్ట్ కూడా ఉంది.
కరోనా నుంచి ‘డబుల్ ప్రొటెక్షన్’ :
మీడియా నివేదికల ప్రకారం.. Jenner Institute COVID-19 వ్యాక్సిన్.. కరోనావైరస్ నుంచి ‘డబుల్ ప్రొటెక్షన్’ అందించవచ్చు. ఈ వ్యాక్సిన్ శరీరంలో యాంటీ బాడీస్, కిల్లర్ T-కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కొత్త టీకా వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని అందించే అవకాశం ఉందని నివేదికలు సూచించాయి.
కిల్లర్ T-కణాలు మానవ శరీరంలో ఎక్కువ కాలం ఉంటాయి. ఎందుకంటే శరీరంలో వైరస్ సోకిన కణాన్ని గుర్తించి చంపేస్తాయి. వ్యాధి పెరగకుండా నిరోధిస్తుందని అంటున్నారు. ఏదేమైనా, COVID-19 రోగులలో రక్షిత యాంటీ బాడీస్ కూడా కేవలం 3 నెలల్లో క్షీణించవచ్చని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. సెప్టెంబరు నాటికి ఆస్ట్రాజెనెకా-సపోర్టు గల COVID-19 వ్యాక్సిన్ అందుబాటులో ఉండవచ్చని నివేదికలు ఉన్నాయి.
సెప్టెంబరులో కల్లా వ్యాక్సిన్ :
సెప్టెంబరులో కల్లా వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు. T సెల్ యాంటీబాడీలను రెండింటినీ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింటి కలయిక సురక్షితంగా ఉంచుతుందని తెలిపింది. ఆక్స్ఫర్డ్ COVID-19 వ్యాక్సిన్ యూకేలో దశ II / III ట్రయల్‌లో ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికా, బ్రెజిల్లో మూడవ దశ ట్రయల్స్ లోకి అడుగుపెట్టింది.
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తయారీ, సరఫరా కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్-స్వీడిష్ ఔషధ తయారీ సంస్థ అస్ట్రాజెనాకాలో చేరింది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ భారతదేశంలో ఆగస్టులో ప్రారంభం కానుంది. మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌కు గురవుతున్న ఆస్ట్రాజెనెకా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌పై పని చేస్తున్నాము. ఆగస్టు 2020లో భారతదేశంలో కూడా హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభిస్తామని వెల్లడించింది.