ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్‌‌‌ ఎదుర్కొంటున్న ఆరు ప్రధాన సమస్యలు.. కొత్త వేరియంట్లపై పనిచేయదా?

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్‌‌‌ ఎదుర్కొంటున్న ఆరు ప్రధాన సమస్యలు.. కొత్త వేరియంట్లపై పనిచేయదా?

Updated On : February 8, 2021 / 10:06 AM IST

Oxford Vaccine Six Problems : ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థతపై రోజురోజుకీ అనేక సందేహాలు, అపోహలు పెరిగిపోతున్నాయి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII)తో భారీ ఉత్పత్తి చేసిన ఈ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కొత్త వేరియంట్ వ్యాక్సిన్లపై దాదాపు పనికిరాదని అభిప్రాయానికి వచ్చేశాయి కొన్ని అధ్యయనాలు. అందులోనూ దక్షిణాఫ్రికా వేరియంట్ వైరస్ నియంత్రించడంలో ఈ వ్యాక్సిన్ సమర్థవత పరిమితంగానే ఉందని గుర్తించారు. వాస్తవానికి ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలో ఉద్భవించింది. ఇతర దేశాలతో పాటు బ్రిటన్‌కు వైరస్ వ్యాపించింది. ఇప్పుడు, దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్‌లో తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో తేలికపాటి లేదా ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరిమిత ప్రభావాన్ని కలిగి ఉందని ఒక అధ్యయనం కనుగొంది.

అయినప్పటికీ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కొత్త వేరియంట్ వల్ల వచ్చే తీవ్రమైన అనారోగ్యాలను ఇంకా నివారించగలదని ఆస్ట్రాజెనెకా ఆశాభావం వ్యక్తం చేసింది. ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా దక్షిణాఫ్రికా వేరియంట్ నుంచి రక్షించడానికి మరో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే ఈ ఏడాది చివర్లో మాత్రమే ఆ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. యూకే వేరియంట్ ను నివారించడంలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సమర్థతవంతంగా పనిచేస్తుందని తేలింది. ఫైజర్-బయోఎంటెక్, మోడ్రెనా వ్యాక్సిన్లు దక్షిణాఫ్రికా వేరియంట్‌ నుంచి రక్షించగలవని ముందస్తు పరిశోధనలు సూచించాయి. నోవావాక్స్ జాన్సెన్ అభివృద్ధి చేస్తున్న రెండు కొత్త టీకాలు కూడా దక్షిణాఫ్రికా వేరియంట్‌ నివారించగలవని రుజువైంది. భారతదేశం కంటే బ్రిటన్ స్వయంగా ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ మీద ఆధారపడుతోంది. అయితే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ఎదుర్కొంటున్న ఆరు ప్రధాన సమస్యలు ఏంటో ఓసారి చూద్దాం..

1. ఇతర కరోనా టీకాలు 90 శాతం సమర్థత కలిగి ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ ట్రయల్ 62 శాతం మాత్రమే సమర్థతను చూపించింది. ఐదుగురిలో ఇద్దరు టీకాను పొందవచ్చు. అయినా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వైరస్ వ్యాప్తి తక్కువ తీవ్రత కలిగి ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

2. ఆక్స్ ఫర్డ్ ట్రయల్ 90 శాతం సమర్థతను కలిగి ఉంది. ఒక చిన్న మోతాదు పొరపాటున ఇచ్చేశారు. విచారణలో ఆక్స్ ఫర్డ్ సమర్థత ఇంకా అస్పష్టంగానే ఉంది. మరికొన్ని ట్రయల్స్ చేయాల్సి ఉంది.

3. ట్రయల్ లో ముగ్గురు వ్యక్తుల కంటే ఎక్కువ మంది లేని ట్రయల్‌లో 90 శాతం సమర్థత ఉందని తేలింది. ఆక్స్ ఫర్డ్ సగటున 70 శాతం సమర్థతను సాధించింది. అయితే ఆక్స్ ఫర్డ్ సాధించిన 90 శాతం 70 శాతం సమర్థతపై బ్రిటన్‌లోని MHRA, మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ రెగ్యులేటరీ అథారిటీ తిరస్కరించాయి.

4. ఆక్స్ ఫర్డ్ తన వాలంటీర్లకు ట్రయల్ సమయంలో తప్పుగా మోతాదు ఇచ్చింది. అయితే ఆ తప్పు జరిగిందని చెప్పలేదని తేలింది. తప్పులను బహిరంగంగా అంగీకరించడం కంటే కప్పిపుచ్చడానికి చేసినట్టుగా అధ్యయనంలో గుర్తించారు.

5. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ హానికరమని ఎక్కడా తేలలేదు. కానీ, ట్రయల్స్ సమయంలో దాదాపు పూర్తిగా 18-55 గ్రూపు వాలంటీర్లలో జరిగాయి. అధిక శాతం మంది సహజంగానే కోలుకుంటారు. ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ ఈ వ్యాక్సిన్‌ను 65 ఏళ్లు పైబడిన వారిపై వాడటానికి నిరాకరిస్తున్నాయి. వృద్ధులలో ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో ఎప్పుడూ పరీక్షించలేదు.

6. దక్షిణాఫ్రికా వేరియంట్‌ ను ఎదుర్కొవడంలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పరిమితంగా మాత్రమే పనిచేస్తుందని ప్రస్తుత అధ్యయనాలు సూచిస్తున్నాయి.