Health Tips: కొబ్బరి నీళ్లు ఆరోగ్యం.. కానీ, వీళ్లకు మాత్రం విషం.. అస్సలు తాగకూడదు
Health Tips: కొబ్బరి నీటిలో పొటాషియం (Potassium) ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ రోగులలో, ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ఉన్నవారిలో, శరీరం నుంచి పొటాషియం బయటకు పంపించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది.

People with these health problems should not drink coconut water at all.
కొబ్బరి నీళ్లు మనిషి ఆరోగ్యానికి అద్భుతమైన ఆరోగ్యాని అందిస్తుంది. దీనిని ప్రకృతిసిద్ధంగా లభించే ఉత్తమమైన హైడ్రేటింగ్ పానీయంగా చెప్పుకోవచ్చు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఎలెక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే శారీరకంగా బలహీనంగా ఉన్నవారిని, ఆరోగ్య సమస్య ఉన్నవారు ఎక్కువగా తాగుతారు. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రం కొబ్బరి నీళ్లు తాగడం మంచిదికాదని నిపుణులు చెప్తున్నారు. మరి దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.కిడ్నీ వ్యాధులు ఉన్నవారు:
కొబ్బరి నీటిలో పొటాషియం (Potassium) ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ రోగులలో, ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ఉన్నవారిలో, శరీరం నుంచి పొటాషియం బయటకు పంపించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇది హైపర్‌కలీమియా అనే ప్రమాదకర పరిస్థితికి దారి తీస్తుంది. ఇది గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
2.డయాబెటిస్ ఉన్నవారు:
కొబ్బరి నీటిలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నా, అధిక మోతాదులో తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచే ప్రమాదం ఉంటుంది. తక్కువ శారీరక శ్రమ చేసే డయాబెటిక్ రోగులు అధికంగా తాగినట్లయితే రక్తంలో షుగర్ స్థాయులు పెరిగే అవకాశం ఉంది.
3.లో బ్లడ్ ప్రెజర్ ఉన్నవారు:
కొబ్బరి నీటిలో సహజంగానే బ్లడ్ ప్రెజర్ ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. దీనిలో పొటాషియం, మాగ్నీషియం వంటి మినరల్స్ అధికంగా ఉండటంతో రక్తనాళాలు విస్తరిస్తాయి. కాబట్టి, రక్తపోటు తగ్గుతుంది. ఇప్పటికే బీపీ తక్కువగా ఉన్నవారు తాగితే మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది.
4.అలర్జీ సమస్య ఉన్నవారు:
కొబ్బరి, కొబ్బరి నీటి పట్ల కొంతమందికి అలర్జిక్ చర్యలు ఉంటాయి. దానివల్ల చర్మం ఎర్రబడటం, ఉబ్బసం, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు.
5.డయురేటిక్స్ తీసుకునేవారు:
కొబ్బరి నీళ్లు సహజ డయురేటిక్ గానే పనిచేస్తాయి. ఇదే సమయంలో డయురేటిక్ మందులు తీసుకుంటే శరీరంలో నుంచి అధిక మోతాదులో సోడియం, పొటాషియం వంటి ఎలెక్ట్రోలైట్స్ బయటకు వెళ్ళుపోతాయి. ఇది ఎలెక్ట్రోలైట్ అసమతుల్యతకు దారి తీసే ప్రమాదం ఉంది.
కొబ్బరి నీళ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నా, కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం జాగ్రత్త వహించాలి. ఏదైనా సహజమైనదని భావించి ఎక్కువగా మోతాదులో తీసుకోవడం ఎప్పటికీ మంచిదికాదు.