Fitness Tips: వ్యాయామం చేస్తున్నారు సరే.. ఇవి ఫాలో అవుతున్నారా? ఒకసారి చెక్ చేసుకోండి
Fitness Tips: వ్యాయామం శరీరానికి మంచిదే కానీ, అధిక వ్యాయామం అనేది మాత్రం చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.

Precautions to be taken while exercising
మనిషి ఆరోగ్యానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయాయం వల్ల ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడటం, గుండె ఆరోగ్యం ఇలా చాలా రకాల సమస్యలకు పరిష్కారం ఇస్తుంది వ్యాయామం. అందుకే నిపుణులు, డాక్టర్స్ సైతం చిన్న చిన్న వ్యాయామాలైనా చేయాలని సూచిస్తారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ వ్యాయాయం, యోగా లాంటివి చేస్తున్నారు. కానీ, వ్యాయాయం చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రం పాటించడం లేదు. వాటిని పాటించకపోవడం వల్ల కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు నిపుణులుమారుతి . మరి ఆ విషయాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వ్యాయామం చేసేటప్పుడు తప్పకుండా పాటించాల్సిన నియమాలు:
అధిక వ్యాయామం చేయకూడదు:
వ్యాయామం శరీరానికి మంచిదే కానీ, అధిక వ్యాయామం అనేది మాత్రం చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఎక్కువ బరువులు ఎత్తడం, సామర్థ్యం కంటే ఎక్కువ శక్తిని ఉపయోగించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది గుండెపై ఒత్తిడి కారణమై గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
కార్డియో వ్యాయామం ఎక్కువగా చేయకూడదు:
ఫిట్‌నెస్ కార్డియో వ్యాయామం చేయడం మంచిదే కానీ, అది తీవ్రతరం కాకుండా చూసుకోవటం మంచిది. ఎవరికైనా ఇప్పటికే గుండె సమస్య ఉంటే అది గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి, కార్డియో వ్యాయామం ఎక్కువగా చేయకుండా ఉండటం ఆరోగ్యానికి మంచిది.
తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలి:
వ్యాయామం చేసేటప్పుడు మీ శరీరంలో కనిపించే మార్పులను, లక్షణాలను గమనించడం చాలా ముఖ్యం. వ్యాయామం వల్ల కొంతమందిలో నొప్పి, అలసట కలుగుతుంది. ఇది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా చేయడం ప్రమాదకరం. ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చు. కాబట్టి, విశ్రాంతి లేకుండా వ్యాయామం చేయకూడదు.
సరిపడా నీళ్లు తాగాలి:
వ్యాయామం చేస్తున్నప్పుడు తప్పకుండ నీరు తాగాలి. నీరు తాగపోవడం పెద్ద తప్పుగా చెప్తున్నారు నిపుణులు. వ్యాయాయం వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశముంది. ఇది రక్తపోటు, హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది. కాబట్టి వ్యాయాయం చేసేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు తాగాలి.