Pumpkin Seeds Benefits : గుమ్మడి గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు.. మెదడు ఆరోగ్యం కోసం మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి..!

Pumpkin Seeds Benefits : గుమ్మడికాయ గింజలు మెదడు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. గుమ్మడి గింజల్లో ప్రధానంగా మెగ్నీషియం పుష్కలంగా ఉందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Pumpkin Seeds Benefits : గుమ్మడి గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు.. మెదడు ఆరోగ్యం కోసం మీ డైట్‌లో తప్పక చేర్చుకోండి..!

Pumpkin Seeds For Better Brain Health: Here's How It Works

Updated On : March 5, 2024 / 7:11 PM IST

Pumpkin Seeds for Brain Health : మీ మెదడు ఆరోగ్యంపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా? బరువు తగ్గడం లేదా ఆరోగ్యకరమైన గుండె కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కానీ, మెదడు ఆరోగ్యం విషయంలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. మెదడు పనితీరును మెరుగుపరచడంలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి.

Read Also : Gut Health Tips : చలికాలంలో మలబద్ధకాన్ని నివారించే అద్భుతమైన 8 ఆహారాలివే.. తప్పక తెలుసుకోండి !

మీ రోజువారీ ఆహారంలో మితంగా కొన్ని సాధారణ ఆహారాలను చేర్చుకోవాలి. మీ రోజువారీ ఆహారంలో బ్రెయిన్ ఫుడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆహారాలు మీ మెదడు పనితీరును పెంచడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

మెదడు ఆరోగ్యం కోసం మీ డైట్‌లో చేర్చుకోండి :
మీ మెదడుకు ఆరోగ్యం కోసం గుమ్మడికాయ గింజలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే.. న్యూరోట్రాన్స్మిషన్, సినాప్టిక్ ప్లాస్టిసిటీతో సహా వివిధ జీవరసాయన ప్రక్రియలలో గుమ్మడికాయ గింజలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉందని పోషకాహార నిపుణుడు వివరిస్తున్నారు. మెగ్నీషియం నరాల సరైన పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడులోని సంకేతాలను ప్రసారం చేయడంలో సాయపడుతుంది.

అదనంగా, గుమ్మడికాయ గింజలు జింక్, కాపర్, యాంటీఆక్సిడెంట్లు వంటివి మెదడుకు మంచి పోషకాలను అందిస్తాయి. మెదడు కణాలకు హానిని నిరోధించి ఆరోగ్యంగా ఉంచుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పు పెరుగులో కొన్ని గుమ్మడికాయ గింజలను తీసుకోవచ్చు. అదేవిధంగా, పెరుగు, ఓట్స్, స్మూతీస్, షేక్స్ లేదా సూప్‌పై చల్లుకోవచ్చు. మీరు తినే పదార్థాల్లో గుమ్మడికాయ గింజలను కూడా చేర్చుకోవచ్చు.

గుమ్మడికాయ గింజలతో ఇతర ప్రయోజనాలు :

  • మెగ్నీషియం కాకుండా, గుమ్మడికాయ గింజలు యాంటీఆక్సిడెంట్లు, జింక్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.
  • గుమ్మడికాయ గింజలు గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సాయపడతాయి.
  • ఈ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
  • గుమ్మడికాయ గింజలు కూడా మంచి నిద్రను కలిగేలా సాయపడతాయి.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!