Saraswati Leaves : మధుమేహులకు దివ్యౌషధం సరస్వతి ఆకులు! ఈ ఆకుల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే?
మానసిక ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు ఉన్నవారు నిత్యం ఈ ఆకులను తింటే ప్రయోజనం కలుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో వన్ టేబుల్ స్పూన్ సరస్వతి ఆకు రసం కలిపి తీసుకోవాలి. ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు తగ్గుతాయి. మెదడు చురుగ్గా, ఉత్సాహంగా పని చేస్తుంది.

Saraswati leaves
Saraswati Leaves : మొక్కల్లో సరస్వతి మొక్కకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సరస్వతి ఆకును చాలా మంది బ్రహ్మి ఆకు అని కూడా పిలుస్తుంటారు. ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా వాడుతారు. ఈ మొక్క ఆకులను పలు ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.చిన్న పిల్లలకు త్వరగా మాటలు రావడానికి, మేథస్సు పెరగడానికి సరస్వతి ఆకుతో తయారు చేసే లేహ్యంను తినిపిస్తుంటారు.
రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సరస్వతి ఆకు అద్భుతంగా సహాయపడుతుంది. సరస్వతి ఆకుల నుంచి రసం తీసి అందులో కొద్దిగా వాము కలిపి తీసుకుంటే గనుక చెడు కొలెస్ట్రాల్ క్రమంగా కరిగి పోయి గుండె ఆరోగ్యవంతంగా మారుతుంది. ఆకులు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. సరస్వతి ఆకులు నాలుగు నమిలి తింటే మేథస్సు పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది.
మానసిక ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు ఉన్నవారు నిత్యం ఈ ఆకులను తింటే ప్రయోజనం కలుగుతుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో వన్ టేబుల్ స్పూన్ సరస్వతి ఆకు రసం కలిపి తీసుకోవాలి. ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు తగ్గుతాయి. మెదడు చురుగ్గా, ఉత్సాహంగా పని చేస్తుంది. పచ్చ కామెర్లు వచ్చిన వారికి సరస్వతి మొక్క ఆకుల రసాన్ని నిత్యం తాగిస్తుంటే ఆ వ్యాధి నుంచి వెంటనే కోలుకుంటారు. ఆకుల రసం తాగితే రక్తం బాగా తయారవుతుంది. రక్తం శుభ్రంగా మారుతుంది.
సరస్వతి మొక్క ఆకులను నీడలో ఎండబెట్టాలి. 5 బాదంపప్పులు, 2 మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా పేస్ట్‌లా చేయాలి. తరువాత ఆ మిశ్రమాన్ని పలుచని వస్త్రంతో వడకట్టి అనంతరం వచ్చే ద్రవంలో తగినంత తేనె కలిపి తాగాలి. నీడలో ఎండబెట్టి పొడి చేసి అందులో తేనె కలిపి తీసుకుంటే.. గొంతు బొంగురు తగ్గుతుంది. స్వరపేటిక వృద్ధి చెందుతుంది. మంచి కంఠ స్వరం కూడా వస్తుంది.
మధుమేహం వ్యాధి గ్రస్తులకు కూడా సరస్వతి ఆకు ఒక దివ్యౌషధమని చెప్పుకోవచ్చు. సరస్వతి ఆకులను నీడలో ఎండ బెట్టి పొడి చేసుకుని. పావు స్పూన్ చొప్పున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా మధుమేహులు చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సరస్వతి ఆకు రసాన్ని తరచూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు దరిచేరవు.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి చికిత్స పొందటం మంచిది.