Birth control pills: గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా.. గుండె, మెదడు స్ట్రోక్ ప్రమాదం.. డాక్టర్స్ ఏమంటున్నారు?
త కొన్నేళ్లుగా 18 నుంచి 49 ఏళ్ల మధ్య యువతుల్లో కనిపించే క్రిప్టోజెనిక్ స్ట్రోక్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. క్రిప్టోజెనిక్ స్ట్రోక్ అంటే మెదడులో రక్త ప్రవాహం ఆగిపోవడం.

Birth control pills side effects
ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్లు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. గర్భం రాకుండా ఉండటానికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. వీటి వల్ల సమస్య తాత్కాలికంగా పరిష్కరించబడినా దీర్ఘకాలంలో మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. ఈ మాత్రలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె, మెదడుపై ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
గత కొన్నేళ్లుగా 18 నుంచి 49 ఏళ్ల మధ్య యువతుల్లో కనిపించే క్రిప్టోజెనిక్ స్ట్రోక్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. క్రిప్టోజెనిక్ స్ట్రోక్ అంటే మెదడులో రక్త ప్రవాహం ఆగిపోవడం. ఈ సమస్య హార్మోన్ మాత్రలు వాడే మహిళల్లో మూడు రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించారు. అధ్యయనాల ప్రకారం హార్మోన్ మాత్రల్లో ఉండే ఈస్ట్రోజెన్ రక్తం గడ్డకట్టే ప్రభావాన్ని పెంచుతుంది. నిజానికి రక్తంలో గడ్డ కట్టడం అనేది సహజమే కానీ, ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉంటే ఇది మరింత వేగంగా గడ్డ కడుతుంది. అది చాలా ప్రమాదం. రక్తం గడ్డ కట్టే ప్రభావం ఎక్కువగా ఉంటే మెదడుకు రక్తం సరఫరా ఆగిపోయి పక్షవాతం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.
కానీ, చాలా తక్కివ మందిలో మాత్రమే ఈ సమస్య వచ్చే అవకాశం ఉండాలి కూడా చెప్తున్నారు. 4700 మంది ఆడవాళ్ళలో కేవలం ఒకరికి మాత్రమే ఈ సమస్త వచ్చే అవకాశం ఉందట. కానీ రోజురోజుకి ఈ మాత్రలు వాడుతున్నవారి సమాఖ్య పెడుతుండటం ఈ సమస్య తీవ్రతను సూచిస్తుంది అంటున్నారు నిపుణులు. అందుకే గర్భనిరోధక మాత్రలు వాడే ముందు డాక్టర్స్ సలహా తప్పనిసరి అవసరం అని చెప్తున్నారు. ఇది చాలా మంది ఆడవాళ్లు తెలియక ఎలాపడితే అలా మాత్రలు వాడుతున్నారు. దానివల్ల దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు.