Weight Loss Tips: మిరాకిల్ బ్రేక్ ఫాస్ట్.. ఉందయం ఇవి తింటే.. కొవ్వు మొత్తం కొవ్వొత్తిలా కరిగిపోతుంది.. పొట్ట ఫ్లాట్ గా మారిపోతుంది
Weight Loss Tips: ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే బీటాగ్లూకాన్ అనే ఫైబర్ మీ మలబద్ధకం సమస్యను తగ్గించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

These 5 types of miracle breakfasts can help you burn fat quickly.
ప్రతి రోజు ఉదయం తీసుకునే మన ఆరోగ్యం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. అయితే, సరైన బ్రేక్‌ఫాస్ట్ ఎంపిక చేసుకుంటే అది కేవలం శక్తినే కాదు, మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ మెటబాలిజం మందగించవచ్చు. కానీ ఈ 5 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు మీ మెటబాలిజాన్ని వేగవంతం చేసి, కొవ్వు కరిగించడంలో సహాయపడతాయి. మరి ఆ మిరాకిల్ బ్రేక్ ఫాస్ట్ ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
1.ఓట్స్‌తో చేసిన బ్రేక్‌ఫాస్ట్:
ఓట్స్‌లో అధికంగా ఫైబర్ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే బీటాగ్లూకాన్ అనే ఫైబర్ మీ మలబద్ధకం సమస్యను తగ్గించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కొవ్వు కరిగించే శక్తిని పెంచుతుంది. ఓట్స్‌ను పాలతో లేదా నీటితో కలిపి వండి దానిలో ద్రాక్ష, అరటి ముక్కలు, గోధుమ గింజలు కలిపితే తింటే రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
2.ప్రొటీన్లతో కూడిన గుడ్డు బ్రేక్‌ఫాస్ట్:
గుడ్లు ప్రొటీన్‌తో కూడిన అద్భుతమైన ఆహారం. ఉదయాన్నే గుడ్డు తీసుకుంటే తినే తిండిపై నియంత్రణ ఉంటుంది. తద్వారా అధికాహారం తీసుకోకుండా ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఉడికించిన గుడ్డు, గుడ్డు ఆమ్లెట్, బుల్లెట్ బాయిల్డ్ గుడ్డుతో కొద్దిగా వెజిటబుల్స్ తింటే ఫ్యాట్ తగ్గుతుంది.
3.గ్రీక్ యోగర్ట్ ఫ్రూట్స్‌తో:
గ్రీక్ యోగర్ట్ ప్రొటీన్స్, ప్రోబయాటిక్స్ లో అధికంగా ఉంటుంది. ఇది జీర్ణతంతువులను శుభ్రం చేస్తుంది. దీనికి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే కొవ్వును కరిగిస్తుంది. గ్రీక్ యోగర్ట్‌కి పైనాపిల్, బ్లూబెరీస్, ఆపిల్ ముక్కలు కలిపి తీసుకుంటే ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గవచ్చు.
4.పచ్చి ఆకుకూరలతో:
ఆకుకూరలతో చేసిన స్మూథీలలో కూడా తక్కువ కాలరీలు ఉంటాయి. అలాగే అధిక న్యూట్రియంట్లను కూడా అందిస్తాయి. ఇవి కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయి. పాలకూర, అల్లం, ఒక అరటి, కొద్దిగా నిమ్మరసం, నీటిని కలిపి స్మూథీ చేసుకొని తినండి. కేవలం కొద్దీ రోజుల్లోనే మీ ఒంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోయి నాజూకుగా తయారవుతారు.
5.మొలకెత్తిన పప్పులు:
మొలకెత్తిన పప్పుల్లో ఫైబర్, ప్రొటీన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మేలైన కొవ్వు కరిగించే ఆహారంగా పరిగణించబడతాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. పెసలు, బంగాళదుంప ముక్కలు, ఉల్లిపాయ, టమాటాలతో కలిపి, కొద్దిగా నిమ్మరసం కలిపితే రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. అలాగే కొవ్వు కరిగించవచ్చు.
ఈ 5 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు తక్కువ కాలరీలతో అధిక పోషకాలు అందించి, మెటబాలిజాన్ని పెంచి, శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం, నిద్ర, నీటి సేవనాన్ని కూడా పాటిస్తే మరింత వేగంగా ఫలితాలు కనిపిస్తాయి.