Varicose Veins: వెరికోస్ సమస్యను నిర్లక్ష్యం చేయకండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే సర్జరీలు, లక్షల్లో ఖర్చు ఖాయం

Varicose Veins: శరీరంలోని రక్తం గుండెకి తిరిగి పోవడానికి వీన్లలో వాల్వులు పనిచేస్తాయి. ఇవి బలహీనపడటం వల్ల రక్తం వెనక్కి ప్రవహించి నరాలలో పేరుకుపోతుంది.

Varicose Veins: వెరికోస్ సమస్యను నిర్లక్ష్యం చేయకండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే సర్జరీలు, లక్షల్లో ఖర్చు ఖాయం

These are must-follow tips to prevent varicose veins

Updated On : July 27, 2025 / 6:06 PM IST

వెరికోస్ వీన్స్ అనేవి శరీరంలో బలహీనమైన లేదా నష్టపోయిన నరాలు వల్ల ఏర్పడే సమస్య. ఇవి సాధారణంగా కాళ్లలో కనిపిస్తాయి. నీలం లేదా ఊదా రంగులో కనిపించే ఈ నరాలు ఊబిపోయినట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు నొప్పి కూడా కలిగించవచ్చు. చూడటానికి ఇది ఒక సాధారణ సమస్యే అయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి వెరికోస్ వీన్స్ సమస్య గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

వెరికోస్ వీన్లకు కారణాలు:

బలహీనమైన వాల్వులు:
శరీరంలోని రక్తం గుండెకి తిరిగి పోవడానికి వీన్లలో వాల్వులు పనిచేస్తాయి. ఇవి బలహీనపడటం వల్ల రక్తం వెనక్కి ప్రవహించి నరాలలో పేరుకుపోతుంది. ఇది నరాలు వంపులుగా. వాపు చెందడానికి కారణమవుతుంది.

జన్యుపరమైన కారణాలు:
వెరికోస్ అనేది జన్యుపరమైన సమస్య. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, వాళ్ళ తరువాత వారికి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువసేపు నిల్చునే లేదా కూర్చునే పనులు:
మనం చేసే పనుల్లో ఎక్కువసేపు నిల్చుని ఉండడం లేదా కూర్చుని పని చేయడం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కూడా వెరికోస్ వీన్స్ సమస్య రావచ్చు.

గర్భధారణ:
మహిళల్లో గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పు జరుగుతుంది. అలాగే శరీర బరువు కూడా పెరుగుతుంది. దీనివల్ల నరాలపై ఒత్తిడి పెరిగి వెరికోస్ వీన్లు ఏర్పడతాయి.

ధూమపానం, అధిక బరువు:
కొన్నిసార్లు వెరికోస్ వీన్స్ సమస్యకు ధూమపానం, అధిక బరువు కూడా కారణం కావచ్చు. ఇవి నరాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

వెరికోస్ లక్షణాలు:

  • కాళ్ల నరాలు బయటకు పడి కనిపించడం
  • కాళ్ళలో నొప్పి, భారంగా అనిపించడం
  • రాత్రివేళల్లో కాళ్లలో క్రాంపులు రావడం
  • చర్మ రంగు మారడం లేదా గాయాలు రావడం

నివారణ చర్యలు:

నిరంతర వ్యాయామం:
వెరికోస్ సమస్యకు మంచి నివారణ అంటే నడక, ఈజీ యోగా అనే చెప్పాలి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.

దృఢంగా సరిపోయే సాక్స్‌లు:
ఇలాంటి సాక్సులు వాడటం వల్ల నరాలపై ఒత్తిడిని తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయి.

బరువు నియంత్రణ:
అధిక బరువు వల్ల నరాలపై ఒత్తిడి పెరగకుండా ఉంటుంది.

దీర్ఘకాలం నిలబడడం/కూర్చోవడం తగ్గించాలి:
పని చేస్తూనే కాస్త కదలాలి, చిన్నచిన్న విరామాలు తీసుకోవాలి.

ఆహార నియమాలు:

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పొటాషియం, విటమిన్ C, విటమిన్ E వంటివి నరాలకు మేలు చేస్తాయి.

వెరికోస్ వీన్లు చిన్న సమస్యగా కనిపించినా, దీర్ఘకాలికంగా చూస్తే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. కనుక ప్రారంభ దశలోనే నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమం. శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ఈ సమస్య నివారణకు ముఖ్యం.