Green Tea Benefits: ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మంచిదేనా.. తాగితే ఏమవుతుందో తెలుసా?

Green Tea Benefits: గ్రీన్ టీ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు, డీటాక్స్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా తాగుతారు.

Green Tea Benefits: ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం మంచిదేనా.. తాగితే ఏమవుతుందో తెలుసా?

What happens if you drink green tea on an empty stomach in the morning?

Updated On : July 9, 2025 / 11:24 AM IST

గ్రీన్ టీ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారు, డీటాక్స్ కోసం ప్రయత్నించే వారు ఎక్కువగా తాగుతారు. అయితే చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం అలవాటుగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంలోనే వారికి వచ్చే సందేహం ఏంటంటే.. ఉదయం పరిగడుపున గ్రీన్ తాగడం మంచిదేనా అని. మరి నిజంగా గ్రీన్ టీని ఉదయం తాగటం మంచిదేనా? తాగితే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ వల్ల కలిగే లాభాలు:

  • గ్రీన్ టీలో ఫ్రీ రాడికల్స్‌ను నివారించే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
  • మెటబాలిజంను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది
  • శరీరాన్ని డీటాక్స్ చేసి శక్తిని ఇస్తుంది
  • మెదడును ఉత్తేజ పరుస్తుంది
  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే ఏమవుతుంది?

1.యాసిడిటీ పెరగచ్చు:
గ్రీన్ టీని ఖాళీ కడుపుతో తాగడం వల్ల అందులో ఉండే టానిన్స్ అనే పదార్థం పేగుల్లో యాసిడ్ స్థాయి పెంచి జీర్ణక్రియను అడ్డుకుంటుంది. దాంతో జలుబు, గ్యాస్, అజీర్ణం, పొత్తికడుపు నొప్పి వంటి సమస్యలు రావొచ్చు.

2.నెగటివ్ క్యాఫెయిన్ ప్రభావం:
గ్రీన్ టీలో కొద్దిమోతలో కేఫైన్ ఉంటుంది. ఖాళీ కడుపుతో దేనిని తీసుకుంటే అది నర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపించి తలతిరుగుడు వంటి అనుభూతుల్ని కలిగించొచ్చు.

3. నుము శోషణను అడ్డుకుంటుంది:
గ్రీన్ టీలోని టానిన్స్ ఖాళీ కడుపులో తీసుకుంటే శరీరం తిన్న ఆహారం నుంచి ఇనుమును (Iron) గ్రహించలేకపోతుంది. ఇది కొంతకాలానికైనా రక్తహీనతకు దారితీయవచ్చు.

మరి గ్రీన్ టీ ఎప్పుడు తాగాలి?

  • ఆహారం తిన్న 30 నుంచి 60 నిమిషాల తర్వాత తాగొచ్చు
  • మధ్యాహ్నం, సాయంత్రం భోజనాల మధ్య గ్రీన్ టీ తాగడం ఉత్తమం.
  • ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.
  • వర్కౌట్‌కు ముందు, తరువాత  శరీరానికి శక్తినిచ్చేలా పని చేస్తుంది.
  • చెమట ద్వారా బయటికి వెళ్లే టాక్సిన్లను త్వరగా విడుదల చేయడంలో సహాయం చేస్తుంది.

ఖాళీ కడుపుతో తాగాలంటే ఏం చేయాలి?

  • వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి?
  • గ్యాస్ట్రిక్ లేదా అల్సర్ ఉన్నవారు
  • గర్భిణీలు, స్తన్యపానం చేస్తున్న తల్లులు
  • చిన్నపిల్లలు (6 సంవత్సరాల లోపు)
  • రక్తహీనతతో బాధపడేవారు

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచి పానీయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఖాళీ కడుపుతో తాగడం ప్రతి ఒక్కరికి సరిపోదు. శరీర స్వభావాన్ని బట్టి ఇది హానికరంగా మారొచ్చు. కనుక, మితంగా మరియు సరైన సమయంలో గ్రీన్ టీ తీసుకుంటే మీరు దీని లాభాలను పూర్తిగా పొందగలరు.