Bitter Gourd Juice Benefits: షుగర్ కంట్రోల్‌కి కాకరకాయ రసం మంచిదే.. కానీ, ఎప్పుడు తాగాలో తెలుసా?

ప్రతీరోజు కాకరకాయ రసం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

Bitter Gourd Juice Benefits: షుగర్ కంట్రోల్‌కి కాకరకాయ రసం మంచిదే.. కానీ, ఎప్పుడు తాగాలో తెలుసా?

bitter guard juice benefits

Updated On : June 8, 2025 / 5:10 PM IST

మారుతున్న జీవనశైలినా, ఆహారపు అలవాట్లా తెలియదు కానీ ఈ రోజుల్లో చాలా మంది డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యతో బాధపడేవారి రోజురోజుకి పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగాడాన్నే షుగర్ వ్యాధిగా చెప్తారు. దానికి ఇన్సులిన్ అసమతుల్యత కారణం. కాబట్టి శరీరంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచే ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి వాటిలో కాకరకాయను ప్రధానంగా చెప్తారు. కొంతమంది కాకరకాయను ఆహారంలో చేర్చుకుంటే చాలా మంది కాకరకాయ రసాన్ని తాగుతారు. ఇది డయాబెటీస్ కంట్రోల్ కి చాలా బాగా సహాయపడుతుంది. కానీ, కాకరకాయ రసాన్ని ఎప్పుడు తీసుకుంటున్నారు అనేది కూడా చాలా అవసరం. అందుకే.. ఈ రసాన్ని ఏ సమయంలో తీసుకుంటే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతీరోజు కాకరకాయ రసం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ రసంలో ఐరన్, జింక్, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిని సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడమే కాదు జీవక్రియ మెరుగుపడుతుంది. చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుందట.

ఉదయం ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగడం వల్ల అనేకరకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయట. ఆ సమయంలో కాకరకాయ రసం తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషాకాలు సంపూర్నంగా అందుతాయట. కాబట్టి.. కాకరకాయ రసం పరిగడుపున తాగడం మంచిదని చెప్తున్నారు. ఇంకా చాలా మంది నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే… కాకరకాయను వేయించి, కూరల చేసి తినడం కంటే రసం చేసుకొని తాగటం మంచిదట. ఎందుకంటే కాకరకాయను వేయించడం వల్ల దానిలోని పోషకాలు తొలగిపోతాయి.