Dengue Cases : డెంగ్యూ కేసులు ఎందుకు తీవ్రమవుతున్నాయి?

డెంగ్యూ వైరస్ ప్లేట్‌లెట్లను నాశనం చేయనప్పటికీ, ప్లేట్‌లెట్ కౌంట్ పనితీరును దెబ్బతీసే సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి 1,50,000 - 4,50,000 ప్లేట్‌లెట్స్ ఉంటాయి. అయితే డెంగ్యూ వైరస్ సోకినప్పుడు, ప్లేట్‌లెట్ కౌంట్ చాలా తక్కువ స్థాయికి చేరుకుంటుంది.

Dengue Cases : డెంగ్యూ కేసులు ఎందుకు తీవ్రమవుతున్నాయి?

Dengue

Dengue Cases : డెంగ్యూ జ్వరం దోమల ద్వారా సంక్రమిస్తుంది. డెంగ్యూ వైరస్ సోకిన వ్యక్తుల్లో అధిక జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, కండరాలు మరియు కీళ్ల నొప్పులు. కొన్ని తీవ్ర పరిస్ధితుల్లో రక్తస్రావానికి దారితీసి ప్రాణాంతకమవుతుంది. డెంగ్యూ జర్వంతో బాధపడుతున్న వారిని కుట్టిన దోమ మరికొరిపై వాలి వారిని కుడితే వారికి కూడా ఈ డెంగ్యూ వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !

డెంగ్యూ జర్వం ఉన్నవారిలో ఆకస్మిక అధిక జ్వరం (105 డిగ్రీలు), తీవ్రమైన తలనొప్పి, కళ్ళు వెనుక నొప్పి, కండరాల నొప్పి, అలసట, వికారం, వాంతులు , అతిసారం , చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో ప్రారంభమైన రెండు నుండి ఐదు రోజుల తర్వాత కనిపిస్తుంది. తేలికపాటి రక్తస్రావం ముక్కు నుండి రక్తస్రావం, చిగుళ్ళలో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారిలో డెంగ్యూ ఇన్ఫెక్షన్లు హెమరేజిక్ ఫీవర్‌కు దారితీసే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు ,లీకేజీ అయినప్పుడు తీవ్రమై రక్తప్రవాహంలో గడ్డకట్టే కణాల సంఖ్య (ప్లేట్‌లెట్స్) తగ్గుతుంది. ఇది స్ట్రోక్, అంతర్గత రక్తస్రావం, అవయవ వైఫల్యం చివరకు మరణానికి కూడా దారితీస్తుంది.

READ ALSO : Eye Health : కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి పాటించాల్సిన 5 సాధారణ జాగ్రత్తలు

డెంగ్యూ వైరస్ ప్లేట్‌లెట్లను నాశనం చేయనప్పటికీ, ప్లేట్‌లెట్ కౌంట్ పనితీరును దెబ్బతీసే సమస్యలను కలిగిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యక్తికి 1,50,000 – 4,50,000 ప్లేట్‌లెట్స్ ఉంటాయి. అయితే డెంగ్యూ వైరస్ సోకినప్పుడు, ప్లేట్‌లెట్ కౌంట్ చాలా తక్కువ స్థాయికి చేరుకుంటుంది. సుమారుగా 40,000 ప్లేట్‌లెట్స్ అంత కంటే తక్కువ స్ధాయికి పడిపోవచ్చు. ఆసమయంలో వైద్యులు రక్తం ఎక్కించటం ద్వారా ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతారు. ప్లేట్‌లెట్ కౌంట్‌ను మెరుగుపరచడానికి ఈ చికిత్స తోడ్పడుతుంది.

READ ALSO : Eating Too Much Fish : చేపలను ఎక్కువగా తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రభావంపడుతుందా ?

ఇటీవలి కాలంలో పెరుగుతున్న డెంగ్యూ ఉధృతి ;

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ కేసులకు కోవిడ్ యాంటీబాడీలు DENV (డెంగ్యూ వైరస్)తో క్రాస్-రియాక్ట్ కావటమేన్న వాదన వినిపిస్తుంది. ఇదే విషయాన్ని ఒక అధ్యయనం పేర్కొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (THSTI)లోని భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం, సహజ మానవ ఇన్‌ఫెక్షన్ , జంతు రోగనిరోధకత ద్వారా పొందిన ప్రతిరోధకాలు జంతువుల కణాలలో డెంగ్యూ సంక్రమణను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని కనుగొన్నారు. SARS-CoV-2 వ్యతిరేక ప్రతిరోధకాలు DENV-2 (డెంగ్యూ వైరస్ 2)తో క్రాస్-రియాక్ట్ కావటం వల్ల సంక్రమణను పెరుగుతుందని ఈ అధ్యయనం మొదటిసారిగా నిరూపించింది. అంతేకాకుండా, డెంగ్యూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో SARS-CoV-2 వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే దీని ప్రభావం కనిపిస్తుందా అన్నదానిపై ఇంకాలోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే . ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.