ఎందుకు భారతీయుల్లో డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువైపోతోంది?

డబుల్ డోస్. 1990 నుంచి భారతీయుల్లో టెన్షన్ ఎక్కువైంది. ఆర్ధిక అవకాశాలు పెరుగుతున్నాయి, డబ్బులు తెచ్చిపెడుతున్నాయి.. అదేసమయంలో ఒత్తిడిని పెంచేస్తున్నాయి. నిజానికి 28 ఏళ్లలో భారతీయులకున్న మానసిక రోగాలు రెండింతలైయ్యాయి.
రోగాల వల్ల కోల్పోయే ఆరోగ్యకర జీవితాన్ని లెక్కవేస్తే, 1990లో మానసిక రోగాల వల్ల భారతీయులు 2.5శాతం జీవితాన్ని కోల్పోతే, అదే 2017 నాటి లెక్కల ప్రకారం చూస్తే.. 4.7 శాతంగా నమోదైంది. అంటే రెండింతలు. దీనివల్ల ప్రతి ఏడుగురిలో ఒకరు సైక్రియాటిస్ట్‌ల వెంట తిరుగుతున్నారు. ఒత్తిడిని తగ్గించే medicines రోజూ వాడుతున్నారు.
అలాగని సరిపడా సైక్రియాటిస్ట్‌లు ఉన్నారంటే అదీ లేదు. ప్రతి లక్షమందికి ఉన్న మానసిక వైద్యులు 0.3 మాత్రమే. నిజానికి మూడు కన్నా ఎక్కువమంది వైద్యులు అందబాటులో ఉన్నారు. అందుకే ఎక్కుమందికి మానసిక సమస్యలున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అంతెందుకు మొత్తం భారతీయుల్లో 14.3శాతం మంది అంటే, దాదాపు 20 కోట్లమందికి ఏదో ఒక మెంటల్ డిజార్డర్ సమస్య ఉందని 2017లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సర్వేలో తేలింది.
ఇందులో సగం మంది stress తట్టుకోలేకపోతున్నారు. లెక్కలు తీస్తే ఐదుకోట్ల మందికి డిప్రెషన్, మరో నాలుగున్నర కోట్ల మందికి తీవ్ర anxiety problemలో బాధపడుతున్నారు. ఈ మానసిక సమస్యలు కాస్తా లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తున్నాయన్నది మరో లెక్క. జీతం పెరిగితే డిప్రెషన్ పెరుగుతుందా? లెక్కలు లేవు కాని జీతానికి, ఒత్తిడికి మధ్య సంబంధం ఉందని ఆరోగ్య శాఖ అంటోంది.
అంతెందుకు ఉత్తరాదితో పోలిస్తే, బాగా డవలప్ అయిన దక్షిణ భారతదేశంలో మానసిక సమస్యలు, ముఖ్యంగా తీవ్ర ఒత్తిడి ఎక్కువే. తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవాల్లో mental disorders కేసులు ఎక్కువగా నమోదైతే కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మణిపూర్‌ల్లో తీవ్ర ఒత్తిడి మానసిక కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ లెక్కన తక్కువ సంపాదించేవాళ్లు కాస్తంగా స్థిమితంగా ఉంటారనుకోవాలి.