Sleeping Tips: మంచి నిద్ర కోసం 7 సూత్రాలు.. తప్పకుండా పాటించండి.. మంచి ఫలితాలు

Sleeping Tips: ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల అలవాటుగా మారుతుంది.

Sleeping Tips: మంచి నిద్ర కోసం 7 సూత్రాలు.. తప్పకుండా పాటించండి.. మంచి ఫలితాలు

7 Healthy Tips For Good Sleeping

Updated On : July 6, 2025 / 12:08 PM IST

నిద్ర మనిషి ఆరోగ్యానికి అత్యంత అవసరం. శరీరం విశ్రాంతి తీసుకుని, మానసిక స్థితి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే నిద్ర చాలా అవసరం. కానీ, ప్రస్తుత పరిస్థితులలో చాలా మందికి నిద్రపట్టడం కష్టంగా మారింది. మానసిక ఒత్తిడి, మొబైల్ వినియోగం, పని ఒత్తిడి, జీవనశైలి ఇలా అనేక కారణాల వల్ల నిద్ర లోపిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని సహజ మార్గాలు పాటిస్తే మంచి నిద్ర పొందవచ్చు.

1.స్థిరమైన నిద్ర సమయాన్ని పాటించండి:
ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల అలవాటుగా మారుతుంది. ఇది శరీరం అంతర్గత గడియారం స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.

2.నిద్రకు ముందు మొబైల్, లాప్ టాప్ వాడటం తగ్గించండి:
ప్రతి రోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల అలవాటుగా మారుతుంది. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వంటివి విడుదల చేసే నీలి కాంతి నిద్ర హార్మోన్ మెలటొనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది తగ్గడం వల్ల నిద్ర సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కనీసం నిద్రకు ఒక గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ వాడకుండా మానేయాలి.

3. రాత్రి తినే ఆహారాన్ని నియంత్రించండి:
రాత్రి అధికంగా తినడం తగ్గించుకోవాలి. మసాలా, ఘాటైన వంటలకు తినడం వల్ల నిద్రపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దానివల్ల అసిడిటీ, అజీర్తి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నిద్రకు కనీసం 2 గంటల ముందే భోజనం చేయడం మంచిది.

4.కాఫీ, టీ, అల్కహాల్ తీసుకోవడం తగ్గించండి:
కాఫీ, టీ, అల్కహాల్ వాడకం పూర్తిగా తగ్గించాలి. ఎందుకంటే ఈ పదార్థాల్లో ఉండే కెఫైన్ నిద్రపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి, నిద్రకు భంగం కలుగుతుంది.

5.పడకగదిని శుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి:
మీ పడకగది ఎప్పుడు శుభ్రంగా, చల్లగా, నిశ్శబ్దంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. బెడ్ రూమ్ లో టేప్ రికార్డర్, మ్యూజిక్ ప్లేయర్స్, టీవీ లు ఉండకుండా చూసుకోవాలి.

6. ధ్యానం, యోగ చేయడం అలవాటు చూసుకోవాలి:
నిద్రకు ముందు 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం లేదా గాఢంగా శ్వాస తీసుకుని విడిచే సాధన చేయడం అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మంచి ఘాడమైన నిద్ర పడుతుంది.

7. వ్యాయామం చేయండి:
రోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా, ఇతర శారీరక వ్యాయామం చేయడం వలన శరీరానికి శారీరక శ్రమ దొరుకుతుంది. అలా చేయడం వల్ల శరీరం అలసిపోయి కాస్త విశ్రాంతి కోరుకుంటుంది. అలా నిద్ర బాగా పెట్టె అవకాశం ఉంది.

మంచి నిద్ర అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలి భాగం. చిన్న మార్పులతో, కొన్ని అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు. దైనందిన జీవనశైలిని సరిచేసుకోవడం ద్వారా నిద్రనై సమస్యల నుండి బయటపడవచ్చు.