చంచల్ గూడ జైలుకి ESI స్కామ్ నిందితులు

  • Published By: venkaiahnaidu ,Published On : September 27, 2019 / 10:46 AM IST
చంచల్ గూడ జైలుకి ESI స్కామ్ నిందితులు

Updated On : September 27, 2019 / 10:46 AM IST

ESI స్కామ్ నిందితులకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ESI డైరక్టర్ దేవికారాణి సహా ఏడుగురు నిందితులను చంచల్ గూడ జైలుకి తరలించారు అధికారులు. ఈ కేసుకి సంబంధించి గురువారం దేవికారాణి 23మంది ఇళ్లలో సెప్టెంబర్ 26వ తేదీ గురువారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. దాదాపు 24 గంటలపాటు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టింది. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. 12కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్టుగా పత్రాలతో సహా ఏసీబీ ఆధారాలు సేకరించింది.

నిబంధనలకు విరుద్ధంగా మందుల కొనుగోలు జరిగినట్లు గుర్తించారు. మరోవైపు 100 కోట్ల మేర అవినీతి జరిగినట్టుగా అధికారులకు ప్రాథమికంగా సమాచారం అందినట్టు తెలుస్తోంది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా… తవ్వుతున్న కొద్దీ మందుల కొనుగోళ్లలో అవినీతి బయటపడుతోంది. గురువారం ఈ స్కామ్ లో ఈఎస్ఐ డైరక్టర్ సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ ఇవాళ(సెప్టెంబర్-27,2019)కోర్టులో హాజరుపర్చగా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది

మరోవైపు ప్రభుత్వం ఈ విషయంపై సీరియస్ గా ఉంది. స్కామ్ సూత్రదారులు,పాత్రధారులను తేల్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. స్కామ్ లో భాగస్వాములపై కఠిన చర్యలకు సీఎంవో ఆదేశించింది.