ఓవైసీపై పోటీకి మాజీ క్రికెటర్

  • Published By: vamsi ,Published On : March 2, 2019 / 03:38 AM IST
ఓవైసీపై పోటీకి మాజీ క్రికెటర్

Updated On : March 2, 2019 / 3:38 AM IST

రాజకీయాల్లో శత్రువుకు మిత్రుడు శత్రువే కదా? అందుకే శత్రువు మిత్రుడిని శత్రువుగా భావిస్తున్న కాంగ్రెస్ పాత మిత్రుడు ప్రస్తుత శత్రువు అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని ఎన్నికల్లో ఓడించేందుకు పావులు సిద్ధం చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ కు భేషరతుగా మద్దతు ఇచ్చిన అసదుద్దీన్ పై పోటీగా పాతబస్తీకే చెందిన హైదరాబాద్ ప్రముఖ క్రికెటర్ అజహారుద్దీన్ ను రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తుంది.

రాబోయే లోక్ సభ ఎన్నికలలో అజారుద్దీన్ ను హైదరాబాద్ లోక్ సభ నుంచి బరిలోకి దింపాలంటూ కాంగ్రెస్ అధిష్టానంకు ప్రతిపాదన పంపినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి 2009, 2014 సాధారణ ఎన్నికల్లో అసదుద్దీన్ పోటీచేసి గెలుపొందారు. త్వరలో జరగనున్న 2019 ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి కోసం అన్వేషించిన కాంగ్రెస్ చివరకు అజారుద్దీన్ ధీటైన వ్యక్తి అని పాతబస్తీకే చెందిన వ్యక్తి కావడంతో అసదుద్దీన్ కు గట్టి పోటీ ఇవ్వగలరని కాంగ్రెస్ భావిస్తుందట.

క్రికెట్ లో రిటైరైన అజహారుద్దీన్ 2009లో ఉత్తరప్రదేశ్ మోర్దాబాద్ నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్తాన్ లోని టాంక్ మదోపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో మాత్రం సొంత ఇలాఖా హైదరాబాద్ నుంచి బరిలోకి దిగాలని అజహారుద్దీన్ అనుకుంటున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ నుండి అజహారుద్దీన్ బరిలోకి దిగవచ్చని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అసుదుద్ధీన్ కు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ వేస్తున్న బ్రహ్మాస్త్రంగా ఈ పరిణామాన్ని కాంగ్రెస్ భావిస్తుంది.