ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఎఫెక్ట్ : పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ భూవివాదంలో సురేష్ అనే రైతు.. ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్లాడు. ఆ

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 06:47 AM IST
ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఎఫెక్ట్ : పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Updated On : November 12, 2019 / 6:47 AM IST

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ భూవివాదంలో సురేష్ అనే రైతు.. ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్లాడు. ఆ

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ భూవివాదంలో సురేష్ అనే రైతు.. ప్లాస్టిక్ బాటిల్‌లో పెట్రోల్ తీసుకెళ్లి.. ఎమ్మార్వో విజయారెడ్డిపై పోసి… నిప్పంటించాడు. తీవ్ర గాయాలతో ఎమ్మార్వో చనిపోయింది. ఈ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ పోసి చంపేస్తామనే బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఆఫీస్ కి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

కొందరు వ్యక్తులు పెట్రోల్ బాటిల్స్ తీసుకుని రెవెన్యూ ఆఫీసులకు వెళ్లి హల్ చల్ చేస్తున్నారు. ఇది కూడా ఉద్యోగుల్లో టెన్షన్ పెంచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ బంకులు పెట్రోల్ పోసే విధానానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. ఎవరైనా బాటిల్ లో పెట్రోల్ పోయాలని వస్తే వారిని తిప్పి పంపేయాలని ఆదేశించారు. దీంతో బాటిళ్లలో పెట్రోల్ పోసేది లేదని బంకుల ఓనర్లు బోర్డులు పెట్టేశారు. ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పొయ్యరు అని తెలుపుతూ ప్రత్యేక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఘటనపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్… కీలక నిర్ణయం తీసుకున్నారని… ఇకపై తెలంగాణలోని ఏ బంకులోనూ ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పొయ్యరాదని తీర్మానించారని అధికారులు తెలిపారు.

విజయారెడ్డిపై దాడిని ప్రేరణగా తీసుకుంటున్న చాలామంది… ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారులను బెదిరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. చాలా మంది ఫోన్లు చేసి… పెట్రోల్ పోసి తగలబెడతామని తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సో.. ఇకపై ఎవరైనా పెట్రోల్ పోయించుకోవాలంటే… వాహనాన్ని వెంట తీసుకెళ్లాల్సిందే.

కాగా, ఈ నిర్ణయం పట్ల కొందరు వాహనదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. దీని వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. దారిలో బైకో, కారో ఆగిపోతే.. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. దగ్గరలో పెట్రోల్ బంక్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో బాటిళ్లలో పెట్రోల్ తమకు చాలా ఉపయోగపడుతుందనేది కొందరు వాహనదారుల వాదన. ఈ విషయంలో కొంత వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నారు.

no pertol