ఇదీ వాస్తవం : బండ్ల గణేష్ రూ.7 కోట్లు ఇవ్వాలి

  • Published By: madhu ,Published On : October 5, 2019 / 07:20 AM IST
ఇదీ వాస్తవం : బండ్ల గణేష్ రూ.7 కోట్లు ఇవ్వాలి

Updated On : October 5, 2019 / 7:20 AM IST

బండ్ల గణేష్ అతి తెలివి చూపించబోయాడు..రూ. 7 కోట్లు ఇవ్వాలి..అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం అలవాటై అయిపోయింది..వాస్తవం ఏంటో తెలియచేస్తాం..అతనిది క్రిమినల్ మైండ్..ఇలాంటి వారికి చట్ట ప్రకారం చేయకపోతే..ప్రజలకు ద్రోహం చేసిన వారవుతామన్నారు వైసీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ). పీవీపీ X బండ్ల గణేష్ మధ్య వార్ కొనసాగుతోంది. వీరి మధ్య ఆర్ధిక వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అర్థరాత్రి తన ఇంటిపై బండ్ల గణేశ్‌ దాడి చేశారని, తనను బెదిరించారని పీవీపీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పీవీపీతో 10tv మాట్లాడింది. 

సాయంత్రం 7గంటలకు కొంతమంది వచ్చారని, బండ్ల గణేష్ పంపించాడని వారు చెప్పడం జరిగిందన్నారు. వందల మందికి ఫైనాన్స్ చేశామని, ఇలాంటి క్రిమినల్ మైండ్ లేదని బండ్ల గణేష్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టెంపర్ సినిమాకు 2013లో డబ్బులు ఇవ్వడం జరిగిందని, 2015లో సినిమా రిలీజ్ అయ్యిందని గుర్తు చేశారు పీవీపీ. ఇంకా దాని తాలుకా డబ్బులు రూ. 7 కోట్లు రావాల్సి ఉందన్నారు.

ఒక ఇండిపెండెంట్ ఆడిటర్‌ను నియమించి విచారణ చేయించుకోవాలని సవాల్ విసిరారు పీవీపీ. ప్రతొక్క కాలేజీ కుర్రాడికి బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు..తదితర విషయాలు తెలుసన్నారు. తన ఆఫీసు సిబ్బందితో బండ్ల గణేష్ టచ్‌లో ఉంటాడని, అతి తెలివి చూపించబోయాడన్నారు. క్రిమినల్ కేసులు వేసినట్లు చెప్పారు. తాను దౌర్జన్యాలు చేశామో లేదో తన ఫోన్ నెంబర్ చెక్ చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే ఫిర్యాదు తీసుకున్నారని, వారు విచారణ చేస్తారని తెలిపారు. దీన్ని వదిలేది లేదని పీవీపీ తేల్చి చెప్పారు.
Read More : టెంపర్ సినిమా వివాదం : నాకు హోంమంత్రి సుచరిత, బొత్స తెలుసని బెదిరించాడు