సొరంగ మార్గం : బేగంపేట టు తాడ్‌బండ్

  • Published By: madhu ,Published On : April 14, 2019 / 03:21 AM IST
సొరంగ మార్గం : బేగంపేట టు తాడ్‌బండ్

Updated On : April 14, 2019 / 3:21 AM IST

బేగంపేట – తాడ్ బండ్ ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించడానికి అధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. సొరంగమార్గం నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. రోడ్డు మార్గం కోసం GHMC కసరత్తు ప్రారంభిస్తోంది. బేగంపేట విమానాశ్రయం కింద నుండి ఈ మార్గం ఉండబోతోంది. దీనిపై ఓ ప్రైవేటు ఏజెన్సీ స్టడీ చేసి GHMCకి ప్రతిపాదనలు ఇచ్చింది. రోడ్డు అందుబాటులోకి వస్తే తాడ్ బండ్, కంటోన్మెంట్, తిరుమలగిరి తదితర ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని అంచనా. దీనితో పాటు మరో 8 రోడ్డు మార్గాల నిర్మాణానికి అధ్యయన సంస్థ ప్రతిపాదనలు ఇచ్చిందని GHMC పేర్కొంది.

భూ సేకరణకు ఇబ్బంది లేకుండా..ప్రభుత్వ భూములు..ఖాళీ స్థలాలను ఎంపిక చేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. అందులో బేగంపేట విమానాశ్రయం సొరంగ మార్గం ఒకటన్నారు. ప్రధాన రోడ్డు నుండి విమానాశ్రయం లోనికి విశాలైన మైన రోడ్డు ఉందని..ఇక్కడ ఫ్లైట్ల రాకపోకలు తక్కువ కావడం..వాహనాలు పెద్దగా తిరగడం లేదని తెలిపారు. ఇక్కడ సొరంగ మార్గం నిర్మించాలని ఏజెన్సీ సూచించడం జరిగిందన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందన్నా GHMC అధికారులు..అనుమతి కోసం తాము ప్రయత్నాలు చేస్తామన్నారు. అనుమతి వస్తే..ప్రతిపాదిత సొరంగం పొడవు 1.1 కి.మీ. అక్కడి నుండి విమానాశ్రయం ప్రహరీ పొడవునా తాడ్ బండ్ రోడ్డు వరకు 1.5 కి.మీ విశాలమైన రహదారిని నిర్మిస్తారు.