బీజేపీ అధ్యక్షుడికి గాయాలు

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ గాయపడ్డారు. ఆయన కంటికి గాయమైంది. బస్ భవన్ ఎదుట

  • Published By: veegamteam ,Published On : October 12, 2019 / 01:16 PM IST
బీజేపీ అధ్యక్షుడికి గాయాలు

Updated On : October 12, 2019 / 1:16 PM IST

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ గాయపడ్డారు. ఆయన కంటికి గాయమైంది. బస్ భవన్ ఎదుట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ గాయపడ్డారు. ఆయన కంటికి గాయమైంది. బస్ భవన్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కల్యాణ మండపం నుంచి బస్ భవన్ వరకు బీజేపీ శ్రేణులు, ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీగా వచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ధర్నాకు అనుమతి లేదన్నారు. దీంతో లక్ష్మణ్‌తో పాటు కార్మిక సంఘాల నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. గంటపాటు ఆందోళన చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.

ధర్నాలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేశారు. బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో తోపులాట జరిగింది. లక్ష్మణ్ సొమ్మసొల్లి కిందపడిపోయారు. ఆయన కంటికి స్వల్ప గాయమైంది. వెంటనే చికిత్స కోసం ఆయనను నిమ్స్ కు తరలించారు. లక్ష్మణ్ గాయం గురించి తెలుసుకున్న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీ కార్మీకులకు మద్దతుగా బీజేపీ ధర్నా చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ధర్నా కార్యక్రమాలు జరిగాయి. కార్మికులతో కలిసి లక్ష్మణ్ బస్‌భవన్ దగ్గర ధర్నాలో పాల్గొన్నారు. బస్‌భవన్‌ ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తోపులాటలో లక్ష్మణ్ కిందపడిపోవడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు లక్ష్మణ్ ని నారాయనగూడ పోలీస్ స్టేషన్ కి తరలించారు.