వీధి రౌడీలా దాడి చేశారు : సర్వేపై బొల్లు ఫైర్

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 12:10 PM IST
వీధి రౌడీలా దాడి చేశారు : సర్వేపై బొల్లు ఫైర్

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై సర్వే అనుచిత వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ ను దుర్భాషలాడుతూ ఆయనపై వాటర్ బాటిల్ విసిరిన సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఈ సందర్భంగా బొల్లు కిషన్ స్పందించారు. ’నా చొక్కా చింపి..సర్వే వీధి రౌడీలా వ్యవహరించారు’ అని ఆరోపించారు.

సర్వే దుర్భాషలాడుతూ తనపై దాడి చేశారని తెలిపారు. హైదరాబాద్ మల్కాజ్ గిరి సమీక్షలో కుంతియాను ఉద్దేశించి సర్వే అసభ్యకరంగా మాట్లాడారని.. సరికాదన్నందుకు తనను బూతులు తిట్టారని పేర్కొన్నారు. వాటర్ బాటిల్ తో తనపై సర్వే దాడి చేశారని బొల్లు కిషన్ ఆరోపించారు.