తెలంగాణ అప్పులు రూ.లక్షన్నర కోట్లు : అసెంబ్లీలో కాగ్ రిపోర్టు

తెలంగాణ అప్పులు రూ.లక్షన్నర కోట్లు : అసెంబ్లీలో కాగ్ రిపోర్టు

Updated On : September 22, 2019 / 6:57 AM IST

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజైన సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం నాటికి కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టింది. సవివరంగా వివరాలు వెల్లడించింది. రాష్ట్రానికి వస్తున్న ఆధాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. 

లాభాలను ఆశించి చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల దాని ప్రభావం ఆర్థికంగా కనిపించిందని కోట్లలో నష్టం వాటిల్లిందని రిపోర్టులో స్పష్టమైంది. క్యాపిటల్ వ్యయం విషయంలో తెలంగాణ ముందంజలో ఉన్నప్పటికీ .. విద్యారంగం కేటాయింపుల్లో మాత్రం వెనుకంజలోనే ఉన్నామని తెలుస్తోంది. 

కొన్నేళ్లు మార్కెట్ నుంచి అప్పులపై ఆధారపడటం వల్ల వడ్డీల చెల్లింపులు పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎక్కువ ఖర్చులు చేస్తోంది. ఫలితాలను మాత్రం ప్రకటించడం లేదు. కాగ్ రిపోర్టు వివరాలిలా ఉన్నాయి. 

* రాష్ట్ర అప్పులు రూ.లక్షా 42వేల కోట్లు
* రెవెన్యూ రాబడితో పరిశీలిస్తే వడ్డీ చెల్లింపులు 12.19శాతం
* వచ్చే ఏడేళ్లలో రాష్ట్రం చెల్లించాల్సిన అప్పులు రూ.65,740కోట్లు
* వాస్తవానికి తెలంగాణ రెవెన్యూ లోటు రూ.284.74కోట్లు
* ద్రవ్యలోటు రూ.27,654కోట్లు
* 2014-19మధ్యలో ప్రాజెక్టులపై రూ. 79,236కోట్లు ఖర్చు
* 19ప్రాజెక్టుల తొలి అంచనా వ్యవయం రూ.41,021కోట్లు
* పనుల జాప్యం కారణంగా పెరిగిన మొత్తం రూ.లక్షా 32వేలు