ఏం జరిగింది : CCS Si సైదులు ఆత్మహత్య 

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 06:20 AM IST
ఏం జరిగింది : CCS Si సైదులు ఆత్మహత్య 

Updated On : December 23, 2019 / 6:20 AM IST

హైదరాబాద్ అంబర్‌పేట పటేల్ నగర్ లో ఎస్సై ఆత్మహత్య కలకలంరేపింది.2017 బ్యాచ్ కు చెందిన సైదులు  సీసీఎస్‌లో ఎస్సైగా పనిచేస్తున్నారు.ఈ క్రమంలో సైదులు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడ్డారు.  వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు.

ఈ విషయంపై వారు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన క్లూస్ టీమ్ తో  ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ తమ కుటుంబంలో ఎటువంటి కలహాలు లేవని అధికారుల వేధింపులు, అనారోగ్యం…2015 నుంచి జీతం లేకపోవడం వంటి కారణాలతో సైదులు ఆత్మహత్య చేసుకుట్లు అతని భార్య నిర్మల అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.