ఏప్రిల్11 పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి : రజత్ కుమార్ 

  • Published By: chvmurthy ,Published On : April 8, 2019 / 02:00 PM IST
ఏప్రిల్11 పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి : రజత్ కుమార్ 

Updated On : April 8, 2019 / 2:00 PM IST

హైదరాబాద్ : ఏప్రిల్11 న జరిగే తొలివిడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని సీఈఓ రజత్ కుమార్  చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ స్ధానంలో ఎక్కువ మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నందున   ప్రత్యేక మైన ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల 97 లక్షల 85 వేల 099 మంది ఓటర్లు ఉన్నారని వీరికోసం  34 వేల 604 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని రజత్ కుమార్ వివరించారు. మంగళవారం సాయంత్రం 5గంటల కు ఎన్నికల ప్రచారం గడువు ముగుస్తుందని,   నిజామాబాద్ లో మాత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని ఆయన చెప్పారు.  ఏప్రిల్ 11 గురువారం రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి   సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. 

“నిజామాబాద్ లో ఉదయం 6 నుంచి 8 వరకు మాక్ పోల్ నిర్వహిస్తాం. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 4 వేల 169 పోలింగ్ స్టేషన్లలో  లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని” రజత్ కుమార్ చెప్పారు.  ఓటర్లు పోలింగ్ బూత్ కు వచ్చేప్పుడు ఓటరు కార్డ్ కానీ,  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఉన్న పాస్ పోర్ట్ , డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డ్ , తదితర 12 రకాల గుర్తింపు కార్డ్ లను  ఏదోఒకటి తీసుకువచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి  పకడ్బందీగా అమలు చేస్తున్నామని,  సోషల్ మీడియా పై ఇప్పటి వరకు  460 కేసులు నమోదు అయ్యాయని రజత్ కుమార్ చెప్పారు.  ప్రగతి భవన్ లో రాజకీయ కార్యకలాపాల పై ఒక రాజకీయ పార్టీ ఫిర్యాదు చేసిందని, దాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపామని ఆయన చెప్పారు. ప్రయివేట్  సంస్ధల ఉద్యోగలుకు కూడా ఏప్రిల్ 11 న సెలవు ప్రకటించామని, సెలవు ఇవ్వక పోతే కంపెనీల పై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలింగ్ స్టేషన్ల  లోపల సెల్ఫీ దిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈసీ చెప్పారు.