మీ అవసరం మాకు తెలుసు : మెట్రో కోచ్ లో ఛార్జింగ్ పాయింట్లు

హైదరాబాద్‌లో మెట్రో రైలులో ఇప్పటికే అనేక సదుపాయాలను కలిపిస్తున్నారు. ఇప్పుడు ప్రయాణికుల సౌకర్యార్ధం మరో సదుపాయంను కూడా మెట్రో రైలు అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌లు, లాప్‌టాప్‌లు చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా చార్జింగ్ సాకెట్లను అందుబాటులోకి తెచ్చారు మెట్రో రైలు నిర్వాహక అధికారులు.
Read Also : బాబోయ్.. బిల్లు కట్టేదెట్టా : కేబుల్, డీటీహెచ్ ఛానళ్లు వెరీ కాస్ట్‌లీ
ఆకాశం నుంచి హైదరాబాద్ అందాలను చూస్తూ సాగిపోయే అనుభూతులు, ఇంకా అనేక సౌకర్యాలు ఇప్పటికే మెట్రో ప్రయాణికులను ఆకట్టుకోగా.. చార్జింగ్ పెట్టుకునేందుకు అందుబాటులోకి సాకెట్లు రావడంపై ప్రయాణికులు ఆనందం వ్యక్దం చేస్తున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్ చేసుకునేందుకు ఎలక్ట్రిక్ పిన్‌పాయింట్లు పెట్టినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ప్రతి కోచ్ లో వీటిని ఏర్పాటు చేశారు. స్వచ్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్ పవర్ వచ్చేస్తోంది. ఎల్బీనగర్ టూ మియాపూర్, హైటెక్ సిటీ ఇలా దూరం వెళ్లే వారికి ఈ సదుపాయం ఎంతో ఉపయోగంగా ఉంటుందని వెల్లడించారు అధికారులు. మీ అవసరాన్ని మేము అర్థం చేసుకున్నాం అంటూ హైదరాబాద్ మెట్రో రైల్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
#Charging your mobiles and laptops, is much easier with sockets in metro coaches. We understand your important needs!#HMR #HyderabadMetro #MetroRail #MyCityMyMetro #MobileCharging #LaptopCharging pic.twitter.com/YsqTwC2GKK
— Hyderabad Metro Rail (@hmrgov) 29 March 2019