తెలంగాణ గర్వించదగ్గ నటుడు
టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ నటుడు అని ప్రశంసించారు. వేణు మృతి సినీ రంగానికి

టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ నటుడు అని ప్రశంసించారు. వేణు మృతి సినీ రంగానికి
టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ నటుడు అని ప్రశంసించారు. వేణు మృతి సినీ రంగానికి తీరని లోటు అన్నారు. వేణుమాధవ్ కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన వేణుమాధవ్ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(సెప్టెంబర్ 25,2019) మధ్యాహ్నం 12:21 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వేణుమాధవ్ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. కమెడియన్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు వేణు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 600 సినిమాల్లో నటించారు. టాలీవుడ్ లో అగ్ర కమెడియన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.
మిమిక్రీ పట్ల ఆసక్తి ఉన్న వేణు మాధవ్ కెరీర్ ప్రారంభంలో కేబుల్ ఛానెల్స్‌లో మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేశారు. 1996లో సినీ రంగ ప్రవేశం చేశారు. సంప్రదాయం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ‘గోకులంలో సీత’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘తమ్ముడు’, ‘యువరాజు’ సినిమాలతో టాలీవుడ్‌లో టాప్ కమెడియన్‌గా ఎదిగారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్స్ అందరితోనూ నటించారు. ‘వెంకీ’, ‘దిల్’, ‘లక్ష్మీ’, సై, ‘ఛత్రపతి’, ‘జై చిరంజీవ’, ‘పోకిరి’, ‘కృష్ణ’, ‘సింహా’, ‘బృందావనం’, ‘కిక్’, ‘రచ్చ’ సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ‘నల్లబాలు నల్లతాచు లెక్క’, ‘సనత్ నగర్ సత్తి’, ‘టైగర్ సత్తి’.. ఇలా ఎన్నో క్యారెక్టర్స్‌ని తన స్టైల్ కామెడీతో పండించారు.