ఎవరు వీరు : సీఎం కేసీఆర్ కారు నెంబరు కాపీ కొట్టారు
సీఎం కాన్వాయ్ కార్ల నెంబర్ TS 09K 6666..
కాన్వాయ్ నెంబరుతో నగరంలో తిరిగేస్తున్న ఏడు కార్లు
జరిమానాలు తప్పించుకునేందుకు కేటుగాళ్ల లీల
నకిలీ నంబర్ ప్లేట్లు పెట్టుకుని రహదార్లపై చక్కర్లు
హైదరాబాద్: ట్రాఫిక్ ఉల్లంఘనలతో గుర్తించిన పోలీసులు.. 2018 లో డమ్మీ నంబర్ ప్లేట్స్ ఉన్న కార్లకు సంబంధించిన వారిపై 13వేల 918 కేసులు నమోదయ్యాయి. అలాగే 2017లో 6,814 మంది ఈ డమ్మీ ప్లేట్స్ తో కార్లను నడుపుతున్నారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో ఆరు కార్లుంటాయి. అన్నింటికీ ఒకే నంబర్ ఉంటుంది. మనిషిని పోలిన మనుషులు ఏడుగురున్నట్లుగా.. సీఎం కాన్వాయ్‌లో ఉన్న ఆ ఆరు కార్లకు అదనంగా బయట అదే నంబర్‌తో మరిన్ని కార్లు దర్జాగా తిరిగేస్తున్నాయి.
2015 నుంచి ఇప్పటి దాకా ఇలా సీఎం కారు నెంబర్‌తో నకిలీ ప్లేట్లను బిగించుకున్న ఏడు వాహనాలకు నిబంధనల ఉల్లంఘన చలానాలు వేశారు తప్ప.. సీఎం కాన్వాయ్‌లోని కార్ల నంబరు వాటికి ఎలా వచ్చింది? అవి అసలు సీఎం కాన్వాయ్‌లోని కార్లేనా? కాదా? కాకపోతే మరి ఎవరివి? అనే ప్రశ్నలకు పోలీసుల దగ్గర సమాధానం లేదు. ఇవి కూడా ఖరీదైనవే. బెంజ్, పార్చునర్, వోల్వో, వోక్స్‌వాగన్ వంటి కార్లు ఉన్నాయి. సీఎం కార్ నంబర్‌తో ఉన్న ఏడు నకిలీ వాహనాలపై చలాన్లు జారీ అయినవే. ట్రాఫిక్ పోలీసుల దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం.. TS09K 6666 రిజిస్ట్రేషన్ నంబర్‌పై 7 చలాన్లు ఉన్నాయి. అందులో ఆరు అతివేగానికి సంబంధించినవే. ఈ కేటుగాళ్ల వల్ల ఇప్పుడా చలాన్లను ఎవరు చెల్లించాలనేది ప్రశ్నగా మారింది. ఈ వాహనాలు ఎవరివో, అసలు నంబర్లేంటో గుర్తించి.. చలానాలను వసూలు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సీఎం భద్రతకే ముప్పుగా మరే అవకాశం ఉంది. ఒకే నంబర్‌పై వేర్వేరు వాహనాలు నగర రోడ్లపై చక్కర్లు కొడుతున్నా.. గుర్తించలేక పోవడం పోలీసుల నిర్లక్ష్యం అనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ బాసులు.. విచారణ చేపట్టారు. కొంతమంది అసలు నంబర్ దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఇలాంటి తలనొప్పులు వస్తున్నాయని ఉన్నాధికారులు అంటున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకమైన డ్రైవ్ లను నిర్వహరణ రెడీ అయ్యారు పోలీసులు. తప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ట్రిపుల్ సవారీ, సెల్ ఫోన్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా రైడింగ్, సీటు బెల్ట్ ధరించకపోవటం వంటి అతిక్రమణలపై కేసుల సంఖ్య 33లక్షల 37వేల 620గా ఉంది. ఇది చాలా టూమచ్ కదూ.. ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్