ఏం జరుగుతోంది : ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ భేటీ
ఆర్టీసీ సమ్మె సమసిపోయింది. కార్మికులంతా విధుల్లో చేరిపోయారు. యథావిధిగా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ సమయంలో... ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆదివారం, డిసెంబర్1నాడు లంచ్ మీటింగ్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఇవాళ్టి సమావేశంలో ఏం తేలుస్తారు.. ఆర్టీసీ భవిష్యత్, కార్మికుల సంక్షేమంపై క్లారిటీ ఇస్తారా.. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటపట్టించేందుకు రూపొందించిన కార్యాచరణను కార్మికులకు వివరించి... ఆర్టీసీ చరిత్రలో నూతనాధ్యాయానికి శ్రీకారం చుడతారా... ఏం జరగుబోతోందని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఆర్టీసీ సమ్మె సమసిపోయింది. కార్మికులంతా విధుల్లో చేరిపోయారు. యథావిధిగా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ సమయంలో… ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆదివారం, డిసెంబర్1నాడు లంచ్ మీటింగ్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఇవాళ్టి సమావేశంలో ఏం తేలుస్తారు.. ఆర్టీసీ భవిష్యత్, కార్మికుల సంక్షేమంపై క్లారిటీ ఇస్తారా.. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటపట్టించేందుకు రూపొందించిన కార్యాచరణను కార్మికులకు వివరించి… ఆర్టీసీ చరిత్రలో నూతనాధ్యాయానికి శ్రీకారం చుడతారా… ఏం జరగుబోతోందని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఆర్టీసీ సమ్మె సమసిపోయింది. కార్మికులంతా విధుల్లో చేరిపోయారు. యథావిధిగా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ సమయంలో… ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆదివారం, డిసెంబర్1నాడు లంచ్ మీటింగ్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఇవాళ్టి సమావేశంలో ఏం తేలుస్తారు.. ఆర్టీసీ భవిష్యత్, కార్మికుల సంక్షేమంపై క్లారిటీ ఇస్తారా.. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాటపట్టించేందుకు రూపొందించిన కార్యాచరణను కార్మికులకు వివరించి… ఆర్టీసీ చరిత్రలో నూతనాధ్యాయానికి శ్రీకారం చుడతారా… ఏం జరగుబోతోందని అందరూ ఎదురు చూస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సుఖాంతమైంది. సమస్యలు పరిష్కరించాలని సుమారు 55 రోజుల పాటు సమ్మె చేసిన కార్మికులు… సీఎం కేసీఆర్ పిలుపుతో… మళ్లీ విధుల్లో చేరారు. దీంతో.. డిపోలు కార్మికులతో కళకళలాడుతున్నాయి. అటు విధుల్లోకి చేరిన కార్మికులు కూడా… హ్యాపీగా పనులు చేసుకుంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల కోసం సీఎం కేసీఆర్ సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ భవిష్యత్ తేల్చేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. నష్టాల్లో మగ్గిపోతున్న ఆర్టీసీని లాభాల బాటపట్టించేందుకు కార్యచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సమ్మె ప్రభావంతో సీఎం కేసీర్ ఆర్టీసీపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్లే కనిపిస్తోంది. సంస్థ వాస్తవ పరిస్థితులను కార్మికులతో నేరుగా తానే మాట్లాడేందుకు రెడీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 97 డిపోలకు చెందిన కార్మికులను సమావేశానికి ఆహ్వానించారు. ప్రతీ డిపో నుంచి వచ్చే ఐదుగురు కార్మికుల్లో కచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలని.. అన్ని వర్గాల కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మను ఆదేశించారు.
ప్రగతి భవన్ వేదికగా జరిగే సమావేశం కోసం ఆదివారం డిసెంబర్ 1, మధ్యాహ్నం 12 గంటలకు కార్మికులు చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం ముగించుకుని సీఎం కేసీఆర్‌తో కార్మికులు భేటీ అవుతారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చిస్తారు. సమ్మె సమయంలో సర్కార్ కాస్త కటువుగా వ్యవహరించిందనే వాదన ఉంది. కానీ… వాస్తవ పరిస్థితులను వివరిస్తే.. కార్మికులు కచ్చితంగా అర్థం చేసుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. కార్మికులతో నేరుగా మాట్లాడటం ద్వారా… వారిలో భరోసా కల్పించే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, యూనియన్లులాంటి అంశాలపై కేసీఆర్ కూలంకషంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
వాయిస్ –
నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకుగాను.. కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిటీ బస్సుల్లో చిల్లర సమస్య తలెత్తకుండా టికెట్లను 10, 15, 20 రూపాయలుగా మార్చాలని భావిస్తోంది. అలాగే.. సంస్థలో నిరుపయోగంగా ఉన్న ఆస్తులను వినియోగించుకునేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తోంది. మారుమూల గ్రామాలకు కూడా కనెక్టివిటీ ఉండటంతో.. సరుకుల రవాణా మొదలుపెట్టే దిశగా యోచిస్తోంది. అలాగే.. కొరియర్ సర్వీసును ప్రారంభిస్తే… ఆర్టీసీకి కొంత మేర ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఇలా… అనేక అంశాలపై సీఎం కేసీఆర్ కార్మికులతో జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
సింగరేణిలాగే ఆర్టీసీని లాభాలబాటపట్టించాలని కేసీఆర్ భావిస్తున్నారు. నలభై ఏళ్లుగా ఆర్టీసీ చుట్టూ అల్లుకున్న సమస్యలకు ఇవాళ శాశ్వత పరిష్కరం చూపించే అవకాశం ఉందని ప్రగతిభవన్ వర్గాలంటున్నాయి. మొత్తానికి సీఎం కేసీఆర్ కార్మికులతో లంచ్ మీటింగ్ ఏర్పాటు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.