CM KCR National Party Effect?: సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు

తెలంగాణలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు సొంత గూటికి చేరారు. కాసేపట్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకున్న నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం నల్లాల ఓదెలు దంపతులు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.

CM KCR National Party Effect?: సొంత గూటికి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు

Updated On : October 5, 2022 / 11:55 AM IST

CM KCR National Party Effect?: తెలంగాణలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు సొంత గూటికి చేరారు. కాసేపట్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకున్న నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మితో కలిసి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం నల్లాల ఓదెలు దంపతులు సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు.

ఓదెలు, భాగ్యలక్ష్మి కొన్ని వారాల క్రితం టీఆర్‌ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ ఇప్పుడు సొంత పార్టీకి తిరిగివచ్చారు. ఓదెలు రాజకీయ జీవితం టీఆర్‌ఎస్‌తోనే ప్రారంభమైంది. 2009 ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ తరఫున చెన్నూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2010లో తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేసి, మళ్ళీ గెలుపొందారు. 2014లోనూ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. కొన్ని రోజులుగా ఆయన టీఆర్ఎస్ నేతలకు దూరంగా ఉన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..