సీఎం కేసీఆర్ ఆదేశాలు : సర్పంచ్ లకు ట్రైనింగ్
హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించే సర్పంచ్‌లు..ఉపసర్పంచ్‌లకు ట్రైనింగ్ ఇవ్వాలని అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జనవరి 11 ప్రగతి భవన్‌లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ అంశంపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించిన సందర్భంగా గ్రామాభివృద్ధి విషయంలో ఎన్నికైన ప్రెసిడెంట్స్ కు, వైప్ ప్రెసిడెండ్స్ కు పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కొత్త సర్పంచ్‌లకు విడతల వారీగా పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
‘ప్రతి గ్రామ పంచాయతీకి కొత్త చట్టం తెలుగు ప్రతులను పంపించాలనీ..పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు సమన్వయంతో పనిచేయడానికి అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికయ్యే ప్రెసిడెంట్స్ ఎప్పుడు ఒకే మూస పద్ధతిలో పనిచేయకుండా గ్రామాల సమగ్ర వికాసానికి గ్రామ పాలకులు ఉద్యమకారులుగా మారేవిధంగా శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల క్రమంలో రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికి సెక్రటరీ నియామకం కూడా జరుగుతుందని..విలేజ్ డెవలప్ మెంట్ లో సెక్రటరీల రోల్ చాలా చాలా కీలకమైనదన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా కొత్తగా రూపొందించిన చట్టంపై నూతన కార్యవర్గానికి అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు.