సమ్మె కాదు ఆర్టీసీనే ముగుస్తుంది : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర

  • Published By: veegamteam ,Published On : October 24, 2019 / 11:29 AM IST
సమ్మె కాదు ఆర్టీసీనే ముగుస్తుంది : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Updated On : October 24, 2019 / 11:29 AM IST

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర రాజకీయ యూనియన్ల సమ్మె అన్నారు. యూనియన్ ఎన్నికల కోసమే పనికిమాలిన సమ్మెలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ అసంబద్ధమైందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపడం అసాధ్యం అని మరోసారి తేల్చి చెప్పారు. 44శాతం జీతాలు పెంచి బాగా పని చేయమని చెప్పానన్నారు. నాలుగేళ్ల కాలంలో 67శాతం కార్మికుల జీతాలు పెంచినా గొంతెమ్మ కోర్కెలు కోరడం దారుణం అన్నారు.

ఆర్టీసీ యూనియన్లపై సీఎం ఓ రేంజ్ లో నిప్పులు చెరిగారు. యూనియన్లవి చిల్లర రాజకీయాలు అని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా అన్నారు. సమ్మె నిర్ణయం కరెక్ట్ కాదన్నారు. యూనియన్ల పేరుతో ఆర్టీసీకి ఉరి బిగిస్తున్నారని చెప్పారు. ఆదాయం వచ్చే సమయంలో సమ్మె చేస్తే ఎలా అని ప్రశ్నించారు. మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ సమ్మె చేయడు అన్నారు. కనీసం జ్ఞానం ఉన్న వాడు ఎవడూ ఇలాంటి పని చెయ్యడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దసరా, బతుకమ్మ పండుగల సమయంలో సమ్మె చేస్తారా అని నిలదీశారు. ఆర్టీసీ మునగక తప్పదని, ఎవరూ కాపాడలేరని సీఎం తేల్చి చెప్పారు. ఇక ముగిసేది సమ్మె కాదు.. ఆర్టీసీనే ముగుస్తుంది అని సీఎం సంచలన కామెంట్స్ చేశారు.

ప్రైవేట్ ట్రావెల్స్ లాభంలో ఉంటే.. ఆర్టీసీకి ఎందుకు నష్టాలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసీలో అద్దె బస్సులే లాభాల్లో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా సమ్మె చేస్తే ఎలా అని యూనియన్ నేతలను కేసీఆర్ నిలదీశారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు ఐదేళ్లలో ఆర్టీసీ సంస్థకి రూ.712 కోట్లు ఇచ్చారని కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీకి రూ.4వేల 250 కోట్లు ఇచ్చామని తెలిపారు. 2019లో కూడా రూ.425 కోట్లు రిలీజ్ చేశామన్నారు. ఆర్టీసీకి రూ.5వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న సీఎం కేసీఆర్..ఆర్టీసీని ఇక ఎవరూ కాపాడలేరని, ఆర్టీసీ పనైపోయిందని బాంబు పేల్చారు. ఆర్టీసీని స్వయంగా యూనియన్ నేతలు ముంచేశారని ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెకి ఆర్టీసీ ముగింపే సమాధానం అని సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. మొత్తంగా ఆర్టీసీ కథ ముగిసింది అని చెప్పకనే చెప్పేశారు.