8 మందితో కాంగ్రెస్ జాబితా : మల్కాజ్ గిరి నుంచి రేవంత్

  • Published By: madhu ,Published On : March 16, 2019 / 01:30 AM IST
8 మందితో కాంగ్రెస్ జాబితా : మల్కాజ్ గిరి నుంచి రేవంత్

తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా 9 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఆ స్థానాల్లోని అభ్యర్థులను రాహుల్‌గాంధీ ఫైనల్ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ… లోక్‌సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలనుకుంటోంది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం పలువురి పేర్లను పరిశీలించి వడపోసి… గెలుపు గుర్రాలను ఖరారు చేసింది. ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ.. 8మంది పేర్లతో తొలిజాబితా విడుదల చేసింది.

 నియోజకవర్గం  అభ్యర్థి పేరు
 మల్కాజ్ గిరి  రేవంత్ రెడ్డి
 చేవెళ్ల  కొండా విశ్వేశ్వరెడ్డి
 కరీంనగర్  పొన్నం ప్రభాకర్
 జహీరాబాద్  మదన్ మోహన్
 ఆదిలాబాద్  రమేష్ రాథోడ్
 పెద్దపల్లి  ఎ.చంద్రశేఖర్
 మెదక్  గాలి అనిల్ కుమార్
 మహబూబాబాద్  బలరాం నాయక్

ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ సహా మొత్తం 9 స్థానాలను  పెండింగ్‌లో ఉంచారు. ఈ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను మార్చి 16వ తేదీ శనివారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. అభ్యర్థుల ఎంపికపై తుదినిర్ణయం రాహుల్‌దేనన్న నాయకులు… అందరికీ న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.