Congress slams AIMIM: అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని తగ్గించడమే ఏఐఎంఐఎం లక్ష్యం: జైరాం రమేశ్

భారత్ జోడో యాత్రలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏఐఎంఐఎం, బీజేపీపై మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని తగ్గించడమే ఏఐఎంఐఎం లక్ష్యమని చెప్పారు. బీజేపీ నుంచి ఏఐఎంఐఎం ఆక్సిజన్ తీసుకుని, తిరిగి బీజేపీకి బూస్టర్ డోసు ఇస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘ఏఐఎంఐఎం ఒక రాజకీయ పార్టీ. గతంలో యూపీఏలో భాగంగా ఉండేది. గతంలో కాంగ్రెస్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ వాడుకునేది. ఇప్పుడు బీజేపీకి చెందిన ఆక్సిజన్ సిలిండర్ ను వాడుకుంటోంది’’ అని చెప్పారు.

Congress slams AIMIM: అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని తగ్గించడమే ఏఐఎంఐఎం లక్ష్యం: జైరాం రమేశ్

AICC President election

Updated On : November 1, 2022 / 3:49 PM IST

Congress slams AIMIM: భారత్ జోడో యాత్రలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏఐఎంఐఎం, బీజేపీపై మండిపడ్డారు. బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని తగ్గించడమే ఏఐఎంఐఎం లక్ష్యమని చెప్పారు. బీజేపీ నుంచి ఏఐఎంఐఎం ఆక్సిజన్ తీసుకుని, తిరిగి బీజేపీకి బూస్టర్ డోసు ఇస్తోందని వ్యాఖ్యానించారు. ‘‘ఏఐఎంఐఎం ఒక రాజకీయ పార్టీ. గతంలో యూపీఏలో భాగంగా ఉండేది. గతంలో కాంగ్రెస్ నుంచి ఆక్సిజన్ సిలిండర్ వాడుకునేది. ఇప్పుడు బీజేపీకి చెందిన ఆక్సిజన్ సిలిండర్ ను వాడుకుంటోంది’’ అని చెప్పారు.

‘‘మనది ప్రజాస్వామ్య దేశం. వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. అయితే, ఏఐఎంఐఎం చేస్తున్న పని మాత్రం పోలింగ్ లో పాల్గొని కాంగ్రెస్ ఓట్లను తగ్గించడమే. ప్రతి రాష్ట్రంలోనూ ఎన్నికల సమయంలో ఏఐఎంఐఎం వెళ్లి పోటీ చేసి కాంగ్రెస్ ఓట్లను తగ్గిస్తోంది’’ అని జైరాం రమేశ్ అన్నారు.

కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర హైదరాబాద్ లో కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ తెలంగాణ నేతలు స్వాగతం పలికారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..