బాబు ఈజ్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ : కేసీఆర్

‘బాబు..ఈజ్ డర్టీయెస్ట్ పొలిటిషీయన్...పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు ? బాబు మాటలకు తలా..తోక..ఏమైనా ఉందా...? బాబుకు మెదడు ఉందా ? ఎలా అర్థం చేసుకోవాలి..ఇంత పచ్చి మోసమా ?

  • Published By: sreehari ,Published On : December 29, 2018 / 12:49 PM IST
బాబు ఈజ్ డర్టీయెస్ట్ పొలిటీషియన్ : కేసీఆర్

‘బాబు..ఈజ్ డర్టీయెస్ట్ పొలిటిషీయన్…పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు ? బాబు మాటలకు తలా..తోక..ఏమైనా ఉందా…? బాబుకు మెదడు ఉందా ? ఎలా అర్థం చేసుకోవాలి..ఇంత పచ్చి మోసమా ?

హైదరాబాద్ : ‘బాబు..ఈజ్ డర్టీయెస్ట్ పొలిటిషీయన్…పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు ? బాబు మాటలకు తలా..తోక..ఏమైనా ఉందా…? బాబుకు మెదడు ఉందా ? ఎలా అర్థం చేసుకోవాలి..ఇంత పచ్చి మోసమా ? ఆయన చెప్పిన మాటలకు కొన్ని పత్రికలు వత్తాసు పలుకుతున్నాయి…ఇష్టమొచ్చినట్లు..మాట్లాడుతారా’ ? అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కేసీఆర్…డిసెంబర్ 29వ తేదీ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. 

హైకోర్టు విషయంలో జాప్యం ఎందుకు ? 
రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు కావస్తోంది..విడదీసింది పార్లమెంట్…వెంటనే హైకోర్టు అక్కడకు మార్చుకోవాల్సి ఉన్నా ఎందుకు చేయలేదు. ..బాబుకి మెదడు ఉందా ? ఎలా అర్థం చేసుకోవాలి ? అంటూ ప్రశ్నించారు. ఇతనికి ఒకటి రెండు పేపర్లున్నాయి…డబ్బా కొట్టుకోవడం..జరుగుతోందని…తెలంగాణ రాష్ట్రంలో ఇక డ్రామా కొనసాగదన్నారు. హైకోర్టు విషయంలో డిసెంబర్ నాటికి వెళ్లిపోతామని ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. ఆంధ్రకు వెళ్లాల్సినవరం లేదని..కోర్టు సపరేట్ చేయాలని తాము అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిపారు.

జనవరి 1 నుండి కోర్టు ఏర్పాటు చేయాలంటూ సుప్రీం చెప్పిందని..దీనిని అమలు చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వంపై ఉందన్నారు. డిసెంబర్ పోతామని ఏపీ ప్రభుత్వం చెప్పి..ఇప్పుడు హడావుడిగా విభజన చేశారని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇంత డర్టీయెస్ట్ పొలిటిషీయన్ ఎవరూ లేరని…బాబు పచ్చి స్వార్థపరుడని..రాజకీయం కోసం  ఎంతకైనా దిగజారుతాడని….ఈ పొలిటీషియన్‌ని భరిస్తున్న ఏపీ ప్రజలకు దండం పెట్టాలని కేసీఆర్ తెలిపారు.