ఈసీ నోటీసులకు సీఎం కేసీఆర్ వివరణ

కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రికి ఈసీ ఈ నోటీసు జారీ చేసింది. అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఏప్రిల్ 12 శుక్రవారం సాయంత్రం లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో కేసీఆర్ తన వివరణను పంపారు. ఈ మేరకు వివరణతో కూడిన ప్రతిని రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్‌కు టీఆర్ఎస్ నేతలు అందజేశారు. ఈ ప్రతిని అందజేసిన వారిలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తదితరులు ఉన్నారు.