తెలంగాణలో ఎన్నికల కోడ్ : రజత్ కుమార్

  • Published By: chvmurthy ,Published On : March 11, 2019 / 01:47 AM IST
తెలంగాణలో ఎన్నికల కోడ్ : రజత్ కుమార్

Updated On : March 11, 2019 / 1:47 AM IST

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని, నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. మార్చి 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోయాయి. లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్నాయి. దీనితో ఎన్నికలకు సంబంధించిన వివరాలను ఎన్నికల అధికారి రజత్ కుమార్ మీడియాకు వెల్లడించారు. 

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మార్చి 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు, రాష్ట్రంలో 2 కోట్ల 95 లక్షల మంది ఓటర్లున్నారన్నారు. మొత్తం 34,603 పోలింగ్ స్టేషన్‌లున్నాయని, రూరల్ ఏరియాలకు 1200 పోలింగ్ స్టేషన్లున్నాయన్నారు. మొత్తం ఎన్నికలకు ఈవీఎంలనే వినియోగిస్తామని చెప్పారు. నామినేషన్ పత్రాలు సమర్పించడానికి వచ్చే అభ్యర్థులు మూడు వాహనాలకు మించి రాకూడదని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు రూ. 75 లక్షల కంటే మించకూడదన్నారు. 72 గంటల్లో ఓటర్లను ప్రభావితం చేయగలిగే బ్యానర్లను తీసివేస్తామన్నారు. అంతేగాకుండా అధికారిక వెబ్ సైట్లలో రాజకీయ నేతల ఫొటోలు ఉండకూడదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని, ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జనరల్ అభ్యర్థులు నామినేషన్ 25వేలు జనరల్ కేటగిరి, ఎస్సీ, 72ఎస్టీ 12, 500