పంచాయతీ సమరం : పోలింగ్ స్టార్ట్

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 01:52 AM IST
పంచాయతీ సమరం : పోలింగ్ స్టార్ట్

Updated On : January 30, 2019 / 1:52 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో తుది విడత పంచాయతీ సంగ్రామం ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యింది. గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఈసీ పూర్తి చేసింది. మూడున్నరవేల గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మధ్యాహ్నం 2గంటల తరువాత ఓట్ల లెక్కింపు చేపడతారు.. 

  • తుది విడతలో 4,116 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్‌ 
  • రాష్ట్ర వ్యాప్తంగా 577 పంచాయతీలు ఏకగ్రీవం 
  • పది గ్రామాల్లో దాఖలు కాని నామినేషన్లు 
  • 3,529 గ్రామాల్లో పోలింగ్‌ 
  • సర్పంచ్‌ పదవులకు 11,667 మంది పోటీ 
  • మొత్తం 36,729 వార్డులకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ 
  • రాష్ట్ర వ్యాప్తంగా  8,959 వార్డులు ఏకగ్రీవం 
  • 186  వార్డుల్లో దాఖలు కాని నామినేషన్లు 
  • 27,582 వార్డులకు పోలింగ్‌ 
  • వార్డు సభ్యుల పదవులకు మొత్తం 73,976 మంది పోటీ 
  • పోలింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు అనుమతిలేదు