GHMC వార్నింగ్ : పార్కింగ్‌ లేని పబ్‌లు, రెస్టారెంట్లు మూసివేస్తాం

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 07:25 AM IST
GHMC వార్నింగ్ : పార్కింగ్‌ లేని పబ్‌లు, రెస్టారెంట్లు మూసివేస్తాం

Updated On : April 17, 2019 / 7:25 AM IST

పబ్‌లు.. బేకరీలపై కొత్త యాక్షన్ తీసుకోనుంది జీహెచ్ఎంసీ. పార్కింగ్ ప్రదేశం కేటాయించకుండా నిర్వహిస్తున్న పలు సంస్థలపై చర్యలు చేపట్టనుంది. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్(ఎంఏ&యూడీ) సూచనల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు, పబ్‌లపై ఇన్‌స్పెక్షన్ చేయనుంది.

‘ఏదైనా ఆఫీసు పార్కింగ్ ప్రదేశం లేకుండా నడుపుతున్నట్లు తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని, ఇబ్బంది ఎక్కువగా అనిపిస్తే వాటిని మూసివేసేలా పనులు చేపట్టనున్నామని’  ఎంఏ&యూడీ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 
Read Also : సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్

కొద్ది నెలలుగా ప్రజల నుంచి వందల కొద్దీ కంప్లైంట్‌లు వస్తున్నాయి. పగటి సమయంలోనే కాకుండా రాత్రుల్లోనూ ఈ ఇబ్బంది కొనసాగుతుంది. జూబ్లీహిల్స్‌లోని ఇరుకురోడ్లలోనూ కమర్షియల్ బిల్డింగ్‌లు కట్టడమే కాకుండా వాటికి పార్కింగ్ సదుపాయం కల్పించలేకపోతున్నారు. ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.36, 45, 46, 33 రోడ్లలో జనసంచారం చాలా ఇబ్బందిగా మారింది. 

బిల్డింగ్ రూల్ ప్రకారం.. ప్రతి కమర్షియల్ బిల్డింగ్‌కు 44శాతం ప్రదేశం పార్కింగ్‌కు కేటాయించాలి. మల్లీప్లెక్స్‌లు అయితే 66శాతం విధించిల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా పబ్స్, రెస్టారెంట్‌లు రూల్స్ అతిక్రమిస్తున్నారు. కస్టమర్లను రోడ్లపైనే తమ వాహనాలు పార్కింగ్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. 

జీహెచ్ఎంసీ 2 నెలల క్రితం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దిల్‌సుఖ్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, కొత్తపేట్, పంజాగుట్టలలో రెస్టారెంట్లు, పబ్‌లను పరిశీలించి తగు చర్యలు తీసుకున్నారు.
Read Also : గూగుల్ Trends : TikTok యాప్ కోసం తెగ వెతికేస్తున్నారు