ఫ్లెక్సీలు, బ్యానర్లు పెడితే భారీ జరిమానా

ప్లెక్సీలు, బ్యానర్లు కారణంగా అనేక చోట్ల చాలా ప్రమాదాలు సంభవించాయి. దీంతో ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది.

  • Published By: veegamteam ,Published On : November 17, 2019 / 03:26 AM IST
ఫ్లెక్సీలు, బ్యానర్లు పెడితే భారీ జరిమానా

Updated On : November 17, 2019 / 3:26 AM IST

ప్లెక్సీలు, బ్యానర్లు కారణంగా అనేక చోట్ల చాలా ప్రమాదాలు సంభవించాయి. దీంతో ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది.

ప్లెక్సీలు, బ్యానర్లు కారణంగా అనేక చోట్ల చాలా ప్రమాదాలు సంభవించాయి. దీంతో ప్లెక్సీల నియంత్రణకు జీహెచ్ఎంసీ నడుం బిగించింది. నగరంలో అనధికారికంగా పెట్టే ప్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాట్లను నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్‌ నగరంలో అనధికార ప్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అనధికార ఫ్లెక్సీల ఏర్పాటు నిషేధాన్ని అన్ని ప్రభుత్వ శాఖలు అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులకు సూచించారు. 

నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసేవారికి జరిమానాలు విధించాలని అన్నారు. అవసరమైతే కేసులు నమోదు చేయాలని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడడంలో ఇదీ ఒక భాగమేనని ఆయన తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అన్నారు. అంతే కాకుండా నవంబర్ 20వ తేదీ లోపు నగరంలోని రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని సంబంధిత సిబ్బంధికి సూచించారు.

ఈ గుంతల కారణంగా ప్రయాణికులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. వీటి వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని తెలిపారు. రహదారులపై ఏర్పడిన గుంతలు పూడ్చివేయాలని ఆదేశించారు.