గోల్కోండ సింహం : బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

హైదరాబాద్ : సీనియర్ బీజేపీ నాయకుడు బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. గత కొన్నిరోజులుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఫిబ్రవరి 10 నుంచి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.
కార్వాన్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఆయన 1985 నుంచి 1994 వరకు 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. బాల్‌రెడ్డి మృతదేహాన్ని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. రేపు సాయంత్రం 5గంటలకు మహాప్రస్థానంలో బాల్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి బీజేపీ తరుఫున పోటీ చేసి పరాజయం పొందారు. పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బాల్‌రెడ్డిని ఆయన అభిమానుల గోల్కోండ సింహంగా పిలిచుకునేవారు.ఆయన పేరును పలుమార్లు గవర్నర్ పదవికి బీజేపీ అధిష్టానం పరిశీలించింది.
Read Also: కాంగ్రెస్ గో బ్యాక్: బస్సు యాత్రను అడ్డుకున్న వైసీపీ
అప్పట్లో ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీకి పాతబస్తీలో ఆయన గట్టిపోటీ ఇచ్చారు. హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ ప్రాబల్యం పెంచిన వారిలో బాల్ రెడ్డి ఒకరు. పలువురు బీజేపీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని బాల్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. బాల్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Also: వాళ్లకు వ్యతిరేకం కాదు.. కశ్మీర్ కోసమే చేస్తున్నా: మోడీ
Read Also: ఓట్ల సర్వే చిచ్చు : యర్రావారిపాలెంలో హై టెన్షన్