సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో భారీగా బంగారం, వెండి స్వాధీనం

  • Published By: veegamteam ,Published On : April 17, 2019 / 10:30 AM IST
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో భారీగా బంగారం, వెండి స్వాధీనం

Updated On : April 17, 2019 / 10:30 AM IST

హైదరాబాద్‌ : లోక్ సభ ఎన్నికలు జరగుతున్న వేళ నగరంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బుధవారం (ఏప్రిల్ 17) ఉదయం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల నుంచి ఏకంగా కిలో బంగారం, 30 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. 

6వ నంబర్ ప్లాట్‌ ఫాంలో ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న బ్యాగు నుంచి ఈ భారీ బంగారాన్ని, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బంగారం, వెండి ఉన్న బ్యాగులను హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  ప్రముఖ వ్యాపారి సుభాష్ వర్మకు చెందిన బంగారంగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు.